ముంబై మోడల్ పూర్ణిమ (26). రోజువారీ జాగింగ్ లో భాగంగా అలసిపోయి బాంద్రా బస్టాండ్ బెంచీపై కూర్చున్న వేళ, హర్యానాకు చెందిన ఇద్దరు బాక్సర్లు వచ్చి వేధించారు. రాత్రి తమతో గడిపేందుకు ఎంత కావాలని అడిగారు. ఆపై పూర్ణిమ గట్టిగా అరవడంతో, వాళ్ళు ఆటోలో పారిపోయారు. వారిని ధైర్యంగా వెంబడించిన పూర్ణిమ పోలీసులకు పట్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నటి కావాలన్న ఏకైక కోరికతో ఆరేళ్ల నుంచి మోడల్ గా పనిచేస్తూ, కువైట్, దుబాయ్, యూఏఈ తదితర దేశాల్లో రాణిస్తున్న పూర్ణిమకు గతంలో 'నార్త్ ఇండియా టీన్ క్వీన్' అవార్డు కూడా లభించింది. యూపీ ప్రభుత్వం తీసిన మ్యూజిక్ వీడియోల్లోనూ నటించి పేరు తెచ్చుకుంది. జమ్మూకు చెందిన పూర్ణిమ అవకాశాల కోసం ముంబైలో ఒంటరిగా ఉంటోంది.
ఇటీవల ఓ రాత్రి 10:30 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ, అలసిపోయి బస్టాండు బెంచీపై కూర్చుని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ బస్టాండ్ నిర్మానుష్యమేమీ కాదు. ఆ సమయంలో ఎంతో మంది అక్కడ ఉన్నారు కూడా. ఇంతలో బలిష్టంగా ఉన్న ఓ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఏమైనా సాయం కావాలా? అని అడిగాడు. పట్టించుకోకుండా పూర్ణిమ తన ఫోన్ తో బిజీగా ఉంది. ఈలోగా ఇంకో వ్యక్తి వచ్చి ఆమెకు అత్యంత దగ్గరగా కూర్చున్నాడు. అతన్ని గమనించి పూర్ణిమ భయపడింది. ఊహించినట్టుగానే అతను మాట్లాడటం ప్రారంభించాడు. రేటెంత? అని అడిగాడు. తమతో రాత్రి గడపాలని కోరాడు. పూర్ణిమ సహాయం కోసం కేకలు వేసినా ఎవరూ పట్టించుకోలేదు. వీరు తనను వేధిస్తున్నారని అరుస్తున్నా చుట్టుపక్కల ఉన్నవారు సాయం చేసేందుకు ముందుకు రాలేదు.
అప్పటికీ వారికి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టాలన్నదే తన ఉద్దేశమని, అయితే, ఇద్దరిలో ఒక పోకిరీ పోలీసుల దగ్గర్నుంచీ పారిపోవడంతో తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని పూర్ణిమ తెలిపింది. తమకు పట్టుబడ్డ యువకుడి పేరు దినేష్ యాదవ్ (27) అని అతనిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని, రెండో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పూర్ణిమ ధైర్యాన్ని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. అప్పటికీ వారికి వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టాలన్నదే తన ఉద్దేశమని, అయితే, ఇద్దరిలో ఒక పోకిరీ పోలీసుల దగ్గర్నుంచీ పారిపోవడంతో తాను ఎఫ్ఐఆర్ నమోదు చేయించానని పూర్ణిమ తెలిపింది. తమకు పట్టుబడ్డ యువకుడి పేరు దినేష్ యాదవ్ (27) అని అతనిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు పెట్టామని, రెండో నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. పూర్ణిమ ధైర్యాన్ని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more