India vs South Africa 5th ODI: south africans top order hit tons in series decider

India vs south africa 2015 5th odi at mumbai south africa sets 438 runs target to india

India vs south africa,India vs South Africa 5th ODI Players,India vs South Africa 5th ODI,India vs South Africa 5th ODI key players,Players to watch out for in 5th ODI,India vs South Africa 5th ODI teams,India vs South Africa 5th ODI Rohit Sharma,Rohit Sharma,MS Dhoni,Virat Kohli,AB de Villiers,Mumbai series decider 5th ODI, Gandhi-Mandela Series 2015 India India vs South Africa India vs South Africa 2015 South Africa South Africa tour of India 2015 South Africa vs India South Africa vs India 2015

south africans top order de cock, duplesis, devillers hit tons in series decider to set a target of 439 runs to india

భారత్ ముందు సఫారీల భారీ విజయలక్ష్యం.. పేలవమైన ఫీల్డింగ్

Posted: 10/25/2015 08:40 PM IST
India vs south africa 2015 5th odi at mumbai south africa sets 438 runs target to india

టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. ముందు రోజు వారు వేసుకున్న ప్రణాళికను చెప్పింది చెప్పినట్లుగానే.. చేసి చూపించారు. నిన్న మీడియాతో మాట్లాడిన అమ్లా..  భారీ స్కోరును టీమిండియాకు లక్ష్యంగా నిర్ధేశిస్తామని చెప్పాడు. అందుకనుగూణంగానే ఇవాళ దక్షిణాప్రికా బ్యాట్స్ మెన్లు శతకాలతో చెలరేగిపోయారు. ఓపెనర్ డీ కాక్,  డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు.  డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేశారు.

దీంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీల చేసిన అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా రెండోసారి తనఖాతాలో వేసుకుంది.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆదినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(23) తొలి వికెట్ ను కోల్పోయిన అనంతరం డీ కాక్ తో కలిసిన డు ప్లెసిస్ దాటి బ్యాటింగ్ చేశాడు. వారిద్దరూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడి రెండో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దీనికి తోడు ధోని సేన పేలవమైన ఫీల్డింగ్ కూడా సఫారీల పరుగులు సునామీకి దోహదపడింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : India  Ind vs SA  mumbai  South Africa  cricket  India vs South Africa 5th ODI  

Other Articles