I feel sad Sharath kumar said

I feel sad sharath kumar said

Nadigar Sangam election, Nadigar Sangam Building, Nadigar Sangam polls, Nadigar Sangam election News, Vishal in Nadigar Sangam election, Sharath Kumar in Nadigar Sangam election, Hero Vishal, Actor Sharath Kumar

After losing a closely-fought Nadigar Sangam election, its former president actor Sarath Kumar sought to clear the air on allegations of corruption made by Team Vishal by making a surprise announcement here on Monday. “On September 29, I cancelled the agreement that I, as the president of Nadigar Sangam, signed with SPI Cinemas to develop the Nadigar Sangam property,” said an emotional Sarath Kumar.

విశాల్ వర్గం మాటలతో బాధపడ్డ శరత్ కుమార్

Posted: 10/20/2015 12:41 PM IST
I feel sad sharath kumar said

తమిళ సినీ ఇండస్ట్రీలొ జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ వర్గం శరత్ కుమార్ వర్గం మీద మెజారిటీ సాధించింది. కాగా విశాల్ వర్గం శరత్ కుమార్ మీద తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో శరత్ కుమార్ తన మీద వచ్చిన ఆరోపణల మీద క్లారిటీ ఇచ్చారు. నడిగర్ సంఘం భవన నిర్మాణాన్ని తాను ఎన్నికల ముందే రద్దు చేసినట్లు ప్రకటించారు. కానీ విశాల్ వర్గం మాత్రం నిన్న ఆ ఒప్పందాన్ని రద్దు చేసినట్లు ఆరోపిస్తోందని అన్నారు. నిజానికి తాను ఎన్నికలకు ముందే నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణంలో శరత్ కుమార్ అవినీతికి పాల్పడినట్లు విశాల్ వర్గం ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేసింది. కాగా వాళ్ల ఆరోపణలు తనను ఎంతో బాధించాయని శరత్ కుమార్ వెల్లడించారు.

నడిగర్ సంఘం భవనాన్ని నిర్మించేందుకు ఎస్పీఐ సినిమా సంస్థతో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా శరత్ కుమార్ గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా దీనిపై విశాల్ వర్గం తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఎన్నికల్లో శరత్ కుమార్ వర్గానికి పెద్ద దెబ్బతీసిన పాయింట్ కూడా ఇదే అని తమిళనాట చర్చ సాగింది. తాజాగా శరత్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎస్‌పీఐ సంస్థతో చేసుకున్న నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందాన్ని సెప్టెంబర్ 29 వ తేదీనే రద్దు చేసినట్టు సంఘం మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ ప్రకటించారు. తనపై మంచి అభిప్రాయం ఉండడం వల్లే ఎస్‌పీఐ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయడానికి అంగీకరించిందన్నారు. ఒప్పంద రద్దు పత్రాలను కొత్త కార్యవర్గానికి అందిస్తానని చెప్పారు. తనకు గౌరవ పదవులను ఇస్తానంటే అంగీకరించనని, గత 30 ఏళ్లుగా నడిగర్ సంఘానికి వివిధ రకాలుగా సేవలు అందించానని అన్నారు. కానీ నడిగర్ సంఘంకు తన సేవలు ఎప్పుడూ అందించడానికి సిద్దంగా ఉంటానని శరత్ కుమార్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles