A mumbai gangster named aftab patel has escaped with bollywood hero sahil khan sister shaistas mercedez benz car | mumbai crime news

Mumbai gangster aftab patel escape with bollywood hero sahil khan sister shaistas mercedez benz car

mumbai rowday aftab patel, bollywood hero sahil khan, sahil khan sister shaista, shaista mercedez benz car, sahil khan sister car, sahil khan sister shaista car stolen

mumbai gangster aftab patel escape with bollywood hero sahil khan sister shaistas mercedez benz car : A mumbai gangster named aftab patel has escaped with bollywood hero sahil khan sister shaistas mercedez benz car.

హీరో చెల్లెల్ని మోసం చేసిన ముంబై రౌడీ

Posted: 10/19/2015 03:17 PM IST
Mumbai gangster aftab patel escape with bollywood hero sahil khan sister shaistas mercedez benz car

ముంబైలో అతడో రౌడీ.. ఇతగాడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఓ హీరో చెల్లెల్ని తన మాయమాటలో పడేశాడు.. తనమీద ఆమెకు పూర్తి నమ్మకం కలిగేలా చేశాడు.. అతని వలలో పడిన సదరు హీరో చెల్లెలు అతగాడు చెప్పినట్లుగానే చేసింది.. అంతే! అతగాడిని అదును దొరకడంతో ఆమెను నిండా ముంచేశాడు. తిరిగి వస్తాడనుకున్న ఆ రౌడీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆ యువతి మోసపోయినట్లుగా గుర్తించి.. తన అన్న ముందు భోరున విలపించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు తెలిపింది.

బాలీవుడ్ హీరో సాహిల్ ఖాన్ కు షయిస్టా అనే సోదరి వుంది. ఈమె తన బెంజ్ కారును విక్రయించాలని నిర్ణయించుకుని.. ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది. దాన్ని గమనించిన ముంబై గ్యాంగ్ స్టర్ అఫ్తాబ్ పటేల్.. ఆ కారును కొనుగోలు చేస్తానని ఆమెకు ఫోన్ చేశాడు. రూ. 42 లక్షలకు కారును కొనేందుకు డీల్ కుదుర్చుకున్నాడు. ఓ సందర్భంలో ఆ రౌడీ కొందరు స్నేహితులతో కలిసొచ్చి.. ఆమెకు అడ్వాన్సుగా రూ. 50 వేలు ఇచ్చాడు. ఆ సందర్భంలోనే టెస్టు రైడ్ కు వెళ్లి వచ్చాడు. పూర్తి డబ్బు ఇచ్చిన తర్వాత కారును తీసుకెళ్తానని నమ్మబలికాడు. అతని మాయమాటల్లో షయిస్టా మునిగిపోయింది. కొన్నిరోజుల తర్వాత మిగతా డబ్బు చెల్లించాలని షయిస్టా ఫోన్ చేసింది. దీంతో ఆ రౌడీ మరోసారి ఆమె దగ్గరకు వచ్చి, ఇంకోసారి పరీక్షించి చూస్తానని చెప్పాడు. అంతే! కారు తీసుకుని అటునుంచి అటే ఉడాయించాడు. అతడు తిరిగి వస్తాడని షయిస్టా భావించింది కానీ.. ఎంతకీ అతగాడి నుంచి సమాచారం అందకపోవడంతో జరిగిన విషయాన్ని హీరో అయిన తన అన్నయ్యకు చెప్పింది.

దీంతో.. వారిరువురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును అందుకున్న పోలీసులు.. కారును దొంగలించిన వ్యక్తి ఎవరో విచారించగా.. అప్పుడు అసలు విషయం బయటపడింది. కారును విక్రయించిన అఫ్తాబ్ ఓ రౌడీ అని.. అతడు పలు కేసుల్లో నిందితుడని, ముంబై నగర బహిష్కరణ శిక్షను కూడా అనుభవిస్తున్నాడని తెలిసింది. ఈ విషయం తెలిసిన షయిస్టా, ఆమె అన్నయ్య ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం ఆ ప్పుడీ కారును ట్రేస్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai rowdy aftab patel  sahil khan sister shaista  mercedez benz car  

Other Articles