Team India loose third match with south africa

Team india loose third match with south africa in rajkot

Sports, Team India, India, South africa, Mandela-Gandhi series, Indian Cricket, India-southafrica series, India lost match, Indian cricket

RAJKOT woke up on Sunday morning anticipating two contests. One obviously pitting India and South Africa in a crucial third ODI at the Saurashtra Cricket Association (SCA) Stadium, and the other between Patidar agitation leader Hardik Patel and the local authorities. Patel’s expected attempts at creating a scene during the match as a part of their protest over reservation fell flat as the agitation leader was detained some five kilometres away from the stadium.

మరోసారి సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి

Posted: 10/19/2015 08:48 AM IST
Team india loose third match with south africa in rajkot

రాజ్‌కోట్‌లో అందివచ్చిన ఆధిక్యాన్ని టీమ్‌ ఇండియా వదిలేసింది. ఆధునిక క్రికెట్‌లో ఛేజింగ్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ క్రీజులో నిలిచినా.. భారత్‌కు గెలుపు భాగ్యం దక్కలేదు. ఛేజింగ్‌లో మరోమారు చతికిల పడింది. డికాక్‌, మోర్కెల్‌ అద్బుత ప్రదర్శనతో సఫారీలు మ్యాచ్‌ను లాగేసుకున్నారు. 2-1తో సిరీస్‌లో ఆధిక్యం సాధించారు. దక్షిణాఫ్రికా చేసిన 271 రన్స్ లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా చతికిలబడి 18 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోనిలు బాగా ఆడినా.. ఫైనల్ గా విక్టరీ మాత్రం సౌతాఫ్రికా సొంతమైంది.  మరోసారి శిఖర్ ధవన్ నిరాశపరచగా, సురేష్ రైనా డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు.  దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 252 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్నీ మోర్కల్ నాలుగు వికెట్లు తీసి టీమిండియా కు చుక్కలు చూపించారు.
 
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. ఓపెనర్లు డీ కాక్, డేవిడ్ మిల్లర్ లు శుభారంభం అందించారు. గత  రెండు వన్డేల్లో విఫలమైన మిల్లర్  33 రన్స్ తో ఈమ్యాచ్ లో ఫర్వాలేదనిపించినా, మరో ఓపెనర్ డీ కాక్ సెంచరీతో చెలరేగాడు. డీ కాక్ 118 బాల్స్ లో 11 ఫోర్లు, ఒక సిక్స్ తో 103 రన్స్ చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా 38.5  ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులతో భారీ స్కోరు దిశగా వెళుతున్నట్లు కనిపించినా  చివరి 11.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది. స్వల పరుగుల వ్యవధిలో డీ కాక్, ఏబీ డివిలియర్స్, జేపీ డుమినిలు పెవిలియన్ కు పంపి దక్షిణాఫ్రికాను టీమిండియా కట్టడి చేసింది.  టీమిండియా బౌలర్లలో మోహిత్ శర్మకు రెండు వికెట్లు లభించగా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రా,అక్షర్ పటేల్ లకు తలో వికెట్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles