Chain snatchers' gang busted; includes former cricket player

Former cricket player murtaza ali turns chain snatcher arrested

former cricket player Murtaza Ali turns Chain snatcher, chain snacthing gang busted, Madya pradesh, police, arrest, madhya pradesh, Under-19 cricketer, Murtaza Ali, Chain snatcher, cricket, player, crime

Police has busted a gang of chain snatchers with arrest of five of its members, including a former Madhya Pradesh's Under-19 cricket player, who were allegedly involved in over 75 crimes.

కటకటాల్లోకి మాజీ క్రికెటర్.. ఈజీ మనీ కోసం అయ్యాడు చైన్ స్నాచర్

Posted: 10/18/2015 11:24 AM IST
Former cricket player murtaza ali turns chain snatcher arrested

క్రికెట్ లో బాగానే రాణించాడు. అండర్ 19 క్రికెట్ జట్టులో రాష్ట్ర స్థాయిలో ఆడాడు. అయితేనేం.. పెరు వచ్చింది కానీ.. రాని డబ్బు అతడ్ని పక్కదారి పట్టించింది. వచ్చిన కాస్తాకూస్తో పాపులారిటీతో జల్సాలకు మరిగాడు, వాటికోసం ఈజీ మనీ వేటలో పడ్డాడు. అందుకోసం వక్రమార్గం పట్టాడు.. అడ్డంగా దొరికిపోయి.. కటకటాల పాలయ్యాడు. నేరాలను వృత్తిగా చేసుకుని ఓ గ్యాంగ్ను తయారు చేశాడు. దీనికి నాయకుడిగా ఉంటూ చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. చివరకు గ్యాంగ్తో సహా అరెస్టయి కటకటాలపాలయ్యాడు. మధ్యప్రదేశ్ అండర్-19 మాజీ క్రికెటర్ ముర్తజా అలీ (30) కథ ఇది.

ముర్తజా అలీతో పాటు చైన్ స్నాచర్ల గ్యాంగ్లోని షాదబ్, హైదర్, గుఫ్రాన్, రజా అలీని అరెస్ట్ చేసినట్టు జహంగీరాబాద్ ఏరియా సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సీఎస్పీ) సలీమ్ ఖాన్ చెప్పారు. 75కు పైగా నేరాల్లో వీరి ప్రమేయమున్నట్టు తెలిపారు. ఈ గ్యాంగ్ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడిందని చెప్పారు. వీరి నుంచి నాలుగు మోటార్ బైక్లు, పది బంగారు చైన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 22 వరకు పోలీస్ రిమాండ్కు ఆదేశించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhya Pradeshs Under-19 cricketer  Murtaza Ali  Chain snatcher  

Other Articles