Man finds live snake in courier sent by jealous husband

Suspicious bengaluru man sends wife s colleague a creepy gift

live snake, bengaluru snake, snake bengaluru, bengaluru jealous husband, snake parcel, bangalore employee, green snake, bengaluru news, india news

The complainant told police that his colleague's husband was opposed to her working under him, and also objected to her receiving work calls at home.

వారితో చనువుగా వుంటున్నారా..? పాము పార్సిల్ వస్తుంది జాగ్రత్తా..!

Posted: 10/17/2015 08:10 PM IST
Suspicious bengaluru man sends wife s colleague a creepy gift

సాధారణంగా తన అనుకున్న వ్యక్తులతో ఇతరులు సన్నిహితంగా మెలిగితే ఎవరైనా రగిలిపోతారు. అయితే ఆఫీసులకెళ్లి పనులు నిర్వహించే భార్యమణుల విషయంలో భర్తలు కూడా తన భార్య యోగక్షేమాలను తెలుసుకునేందుకు అక్కడ ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటారు. ఇక అదే సాఫ్ట్ వేర్ కంపెనీలలో అయితే టీమ్ లీడర్ సహా ఆ టీమ్ లో వున్న వాళ్లంతా ఒక టీమ్ గా ఏర్పడి వారికి కేటాయించిన ప్రాజెక్టులో పనిచేయాల్సి వుంటుంది. దీంతో టీమ్ లీడర్ తో వారు కాస్తా చనువుగా వుండాల్సిన అవసరం కూడా వుంది.

ఇలా తన భార్యతో వేరే వ్యక్తి చనువుగా ఉంటున్నాడన్న సమాచారం అందుకు ఏ భర్తకైనా ఒళ్లు మండుతుంది. ఈ పరిస్థితి ఎదురైతే ఏ భర్త అయినా ధైర్యముంటే వెళ్లి అతడిని హెచ్చరించడమో, లేదా భార్యకు నచ్చచెప్పడమో చేస్తారు. కానీ బెంగళూరులో ఓ భర్త కొత్తగా ఆలోచించాడు. తన భార్యతో చనువుగా ఉంటున్న సహ ఉద్యోగికి పార్శిల్ ఒకటి పంపించాడు.  అందమైన పార్సిల్‌ను అందుకున్న రాజ్‌కుమార్ కచ్చితంగా అది తన శ్రేయోభిలాషుల నుంచే వచ్చి ఉంటుందని, అందులో ఏవో స్వీట్లు లేదా తినుబండారాలు ఉండొచ్చని భావించారు.

మధ్యాహ్నం లంచ్ సమయం వరకు ఆ పార్సిల్‌ను తెరవకుండా అలాగే భద్రంగా దాచారు. లంచ్‌కు క్యాంటీన్‌కు వెళ్లినప్పుడు దాన్ని తన టేబుల్ ముందు పెట్టుకొని తెరిచారు. అంతే... ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీలయ్యారు. తిను బండారాల మాట దేవుడెరుగు ఆ బాక్సులో అత్యంత విషపూరితమైన ఆకుపచ్చ పాము కనిపించింది. పార్శిల్‌ తెరిచి చూసిన ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. పాముతో పాటు ఓ లేఖను కూడా పంపించాడు. ఆఫీసులో ఓ మహిళా ఉద్యోగితో చనువుగా ఉంటున్నావని, ఆమెతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సదరు వ్యక్తిని హెచ్చరిస్తూ ఆ మహిళా ఉద్యోగి భర్త లేఖ రాశాడు

బెంగళూరు నగరంలోని శివానంద సర్కిలో ఉన్న బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. లేఖను సాక్ష్యంగా మార్చుకున్న సదరు బాధితుడు సరాసరి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు. పోలీసులకు తనకెదురైన ఘటనను చెప్పిన బాధిత వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు వాకాబు చేయగా, పార్శిల్ పంపిన వ్యక్తి నకిలీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చారని గ్రహించారు. పిర్యాదుదారుడిని పిలిచి తాను చనువుగా వుంటున్న మహిళా ఉద్యోగి గురించి విచారించారు. అయితే తాను అమెతో చనువుగా లేనని బాధితుడు చెప్పాడు.

మహిళా ఉద్యోగిని విచారించిన పోలీసులకు అదే సమాధానం రావడంతో అమె భర్తపైకి అనుమానం వెళ్లింది. దీంతో ఆయనపై కేనును నమోదు చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే ఎలా కేసును నమోదే చేయాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే.. దేనితో చంపాలని చూశాడని న్యాయస్థానం అడిగితే.. విషనాగును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చాల్సి వుంది. అయితే అప్పటికు విషనాగును పిర్యాధుదారుడు వదిలేయలేయడంతో దానిని ఎక్కడి నుంచి తెప్పించాలో తెలియక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే అంత్యంత విషపూరితమైన ఆ ఆకుపచ్చ పాము కాటుకు గురికాకపోవడం పిర్యాదుదారిడి అదృష్టమని, ఈ కేసులో సంతృప్తినిచ్చే విషయమని పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : snake parcel  bangalore employee  green snake  

Other Articles