మగువలను ఎన్ని రకాలుగా మోసం చేయాలో తెలిసిన పైశాచిక మృగాలు.. ప్రతినిత్యం నూతన విధంగా వారిని నమ్మించి, మోసగిస్తున్న ఘటనలు వెలుగుచూస్తూనే వున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ యువతి జన్మదిన వేడుకలను సంబరంగా జరుపుకుందామని చెప్పి నమ్మబలికి.. అమెతో పాటు అమె స్నేహితురాళ్లలపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వంతుల వారీగా మార్చి మార్చి వారిపై అత్యాచారాలకు తెగబడిన ఆరుగురు మగ మృగాళ్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని గుర్గావ్ నగరపరిథిలోని డిఎల్ఎఫ్ ఫేస్ టు క్వార్టర్ లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ యువతి జన్మదినాన్ని పురస్కరించుకుని.. చాలా బాగా సెలబ్రేట్ చేద్దామని నమ్మించిన ఓ యువకుడు స్థానికంగా వున్న ఓ గెస్ట్ హౌస్ కు అమెను తీసుకెళ్లాడు. ఒంటరిగా వెళ్లడం ఇష్టంలేని ఆ యువతి తోడుగా మరో యువతిని వెంటబెట్టుకుని వెళ్లింది. అయితే వీరి గెస్ట్ హౌస్ లోకి వెళ్లగానే కొద్ది సేపటికీ ఐదుగురు నేపాలీ యువకులు అక్కడి వచ్చారు. పుట్టినరోజు పార్టీ అని చెప్పి పీకల దాక ఫూటుగా మందుకోట్టారు.
మద్యం మత్తులో పార్టీలో వున్న ఇద్దరు యువతులతో అసభ్యంగా ప్రపర్తించడం ప్రారంభించారు. కామవాంఛతో తమపై తోడేళ్లు మీదపడుతున్నాయని గ్రహించిన ఇద్దరు యువతలు ఎంత నిలువరించేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. ఆరుగురు వంతుల వారీగా ఇద్దరు అభాగినులపై సామూహికంగా అత్యచారం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అందరికీ పంపుతామని కూడా హెచ్చరించారు.
అయితే ఆ పార్టీ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న యువతి స్నేహితురాలు పరుగుపరుగున వెళ్లి విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితులపై 323, 342, 506, 376డి, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపారు. ఇద్దరు యువతులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిందారు. ఈ ఘటనపై పోలీసులు గెస్ట్ హౌస్ లో పనులు చేస్తున్న కార్మికులను ప్రశ్నించడంతో పాటు సిసిటీవీ ఫూటేజీని కూడా పరిశీలిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more