Rahul Gandhi boosts AP Congress

Aicc vice president rahul gandhi boosts ap congress

Rahul Gandhi, AP, Congress, Special Status, Rahuveera Reddy, AICC, Special Status for AP

AICC Vice president Rahul Gandhi boosts AP Congress. Rahul gandhi took class to ap congress leaders. He said that gain lost vote bank by special status issue in AP.

ఏపి కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ క్లాస్

Posted: 10/17/2015 12:41 PM IST
Aicc vice president rahul gandhi boosts ap congress

ఏపి కాంగ్రెస్ నాయకులకు ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఉపదేశాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపి విభజన తర్వాత పూర్తిగా దెబ్బతింది. ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్న అపవాదుతో కనీసం ఎలక్షన్ లో కూడా నిలిచేందుకు అభ్యర్థులు కూడా దొరకలేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీ ఏపి కాంగ్రెస్ నాయకులకు క్లాస్ తీసుకున్నారు. రాహుల్ గాంధీ ఆంద్రప్రదేశ్ రాజకీయాల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో నీరు కారిపోయిన నేతలను ఉత్సాహ పరచడానికి రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపిలో తిరిగి పార్టీకి బూస్టింగ్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో బాగంగానే కాంగ్రెస్ నాయకులకు వీలైనంత వరకు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నాలు చేశారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకు దైర్ఘ్య వచనాలు చెప్పారు. అందులో భాగంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన మనదే, పోరాడి దానిని అమలు చేయించాల్సిందీ మనమే, ఇది మన బాధ్యత, మీరు పోరాటాన్ని మరింత తీవ్రం చేయండి, మీకు అండగా నేను ఉంటా అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ చెప్పారు. రాహుల్ ను ఆయన నివాసంలో రఘువీరా రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ కలిశారు. ప్రత్యేక హోదా, ఏపీకి ఇచ్చిన ఇతర హామీల అమలు, అమరావతి శంకుస్థాపన, ప్రధాని పర్యటన తదితర అంశాలపై చర్చించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపైనా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా చాంపియన్ కాంగ్రెస్ పార్టీయేనని నాయకులు తీర్మానించారు.మరి రాహుల్ ఇచ్చిన అభయంతో అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు చెలరేగిపోతారో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  AP  Congress  Special Status  Rahuveera Reddy  AICC  Special Status for AP  

Other Articles