Osama bin Laden was Pakistan's 'guest' when US forces killed him, reveals ex-defence minister Ahmed Mukhtar

Pakistan rattled by expose showing it sheltered osama bin laden

Osama Bin Laden,Pakistan's guest,US Forces,Ex-defence minister Ahmed Mukhtar,Al-Qaeda founder,Military town Abbottabad,Abbottabad,Osama,Al-Qaeda,State guest,Former defence minister Chaudhry Ahmed Mukhtar,Chaudhry Ahmed Mukhtar,World Trade Centre,American Navy Seal commandos,imtiaz rashid qureshi,Osama bin Laden, parvez musharaff, pakistan

The Pakistan government and its army were not just aware of the presence of Osama bin Laden in the country, but the al-Qaeda founder was in fact a state "guest", quoting the country's former defence minister Chaudhry Ahmed Mukhtar

ధాయాది కుతంత్రం భట్టబయలు..లాడెన్ ను అధితిగా చూశామన్న పాక్ మాజీ మంత్రి

Posted: 10/14/2015 04:08 PM IST
Pakistan rattled by expose showing it sheltered osama bin laden

పాకిస్ధాన్ కుట్రలు, కుతంత్రాలు నెరపడం కొత్తేమీ కాదు. తప్పులన్నీ తానే చేస్తూ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ.. నెపాన్ని మాత్రం ఇతరులపైకి తోసేయడం పాక్ కు వెన్నతో పెట్టిన విద్య అన్న విమర్శలు ఉవ్వెత్తున్న వినబడుతున్నాయి అయితే అబద్దాన్ని నిజమని చెప్పి ఎల్లకాలం ఎవరినీ నమ్మించలేమన్నది వాస్తవం. ఇప్పుడదే వాస్తవం వెలుగుచూసే సరికి పాకిస్తాన్ అసులు రంగు మరోమారు భట్టబయలైంది. స్వయంగా ఆ దేశానికి చెందిన మాజీ రక్షణ శాఖమంత్రి ఓ భారతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యావత్ ప్రపంచం విస్తుపోయేలా బాంబు పేల్చారు.

అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని పాకిస్థాన్ మాజీ రక్షణ శాఖమంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చెప్పారు. ఒసామాను తమ దేశం అత్యంత ప్రాధాన్యత గత అధితిగా చూసుకుందని కూడా చెప్పారు. అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ తమ దేశంలోనే ఉన్నాడన్న విషయం నాటి అగ్రనేతలు ఆసిఫ్‌అలీ జర్దారీ, ఆర్మీ చీఫ్‌ అష్పాక్‌ కయానీ తదితరులకు తెలుసునని పాకిస్థాన్‌ రక్షణశాఖ మంత్రి చౌదరి అహ్మద్‌ ముక్తార్‌ వెల్లడించారు.

ఓ భారత పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చౌదరీ అహ్మద్ ముక్తార్ ఈ వ్యాఖ్యలను చేయడం ఇప్పుడు సంచలనం సృష్టించాయి. ఇప్పటివరకూ అబోటాబాద్‌లో లాడెన్‌ ఉన్నట్లు తమకు తెలియదని తమ ప్రమేయం లేకుండానే అమెరికా దాడులు జరిపి ఆయన్ను హత్య చేసిందని నమ్మిస్తూ వచ్చిన పాకిస్థాన్‌కు అహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు ఇరకాటంలో పడేశాయి. తమకు తెలియకుండానే అమెరికా దళాలు అబోటాబాద్లోని లాడెన్ నివాసంపై దాడులు చేసి హతమార్చిందని యావత్ ప్రపంచాన్ని నమ్మించిన పాకిస్థాన్ ఇప్పడు కుడిదిలో పడిన ఎలుక పరిస్థితిని ఎదుర్కోంటోంది.

అహ్మద్ ఒక అబద్ధాలకోరు అని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని పాకిస్థాన్ ఆర్మీ మాజీ ఛీప్ , ఆర్మి జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆర్మీ ఉన్నతాధికారిగా కోనసాగిన రఖీద్ ఖురేషీ కూడా అహ్మద్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. 'అహ్మద్ ముక్తార్ ఇలాంటి మాటలను అన్నారంటే తాను నమ్మలేకపోతున్నానన్నారు.. ఒక వేళ ఆయన నిజంగా ఈ మాటలు అంటే ముక్తార్కు ఏదో అయి ఉంటుంది. అయితే, పాక్ అధ్యక్షుడికి నాటి లాడెన్ గురించి ముందే తెలుసు అని అహ్మద్  అన్నట్లు తాను మాత్రం వినలేదని రషీద్ ఖురేషి అన్నారు. 2008 నుంచి 2012 మధ్య కాలంలో అహ్మద్ ముక్తార్ పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles