Lalu Yadav and Nitish betrayed me: Mulayam Singh Yadav

Mulayam singh yadav predicts bjp s victory in bihar

mulayam singh yadav,samajwadi party,rjd,jd(u),claims of development,socialist movement,national,Bihar CM Nitish Kumar, Grand Alliance.Samajwadi Party, BJP, bihar polls, Bihar,

Coming down heavily on Bihar CM Nitish Kumar during the campaigning in the state and accused him of ditching his friends. Mulayam put the blame on Nitish for Samajwadi Party’s exit from the Grand Alliance.

అడిగినన్ని సీట్లు ఇవ్వలేదని.. ప్లేటు ఫిరాయించారు..

Posted: 10/13/2015 06:39 PM IST
Mulayam singh yadav predicts bjp s victory in bihar

బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. శత్రువులు అనుకున్న వాళ్లు మిత్రులవుతున్నారు. బంధుత్వం వేరు రాజకీయం వేరంటూ మరికోందరు ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయిస్తున్నారు. తొలి విడత ఎన్నికలు ముగియగానే ఇన్ని గమత్తులు జరుగుతండగా, ఇక మరో నాలుగు విడతల ఎన్నికలు ముగిసే సరికి మరెన్ని విచిత్రాలు చోటుచేసుకుంటాయోనని రాజకీయ విశ్లేషకులు అంచానాలు వేసుకుంటున్నారు.. తొలి విడత ఎన్నికలు ముగిసిన అనంతరం ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా నిలించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి ఓడిపోతుందుందన్న ముందుగానే ప్రకటించిన ములాయాం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. మహాకూటమి ఓటమికి తాము కలిసికట్టుగా ఉండకపోవడమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో సీఎం నితీష్‌కుమార్ తమను మోసం చేశారని ఆరోపించారు. జనతా పరివార్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఒక విధంగా, సీట్ల పంపిణీ సమయంలో మరో మాట మాట్లాడారని నిప్పులు చెరిగారు. ఉన్నట్టుండి సమాజ్ వాధీ అధినేత ములాయం సింగ్ ఇలా ప్లేటు ఫిరాయించడంపై విమర్శలు వినవస్తున్నాయి. కూటమిగా ఏర్పడినప్పుడు అనుకున్నన్ని సీట్లు రాకపోయినా.. కలసివుండాలని అదే రాజధర్మమని, అలా కాకుండా వేరుకుంపటి పెట్టుకున్న ఎన్నికలకు వెళ్లి.. ఇప్పుడు మళ్లీ అదే కూటమిపై విమర్శలు చేయడం తగదని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samajwadi Party  Mulayam Singh Yadav  BJP  bihar polls  Bihar  

Other Articles