Bandla Ganesh Given Counter Tweets On Ram Gopal Varma | Pawan Kalyan Controversy | Janasena Party | Pawanism

Bandla ganesh counter tweets on ram gopal varma pawan kalyan controversy

bandla ganesh news, pawan kalyan news, ram gopal varma, bandla ganesh vs ram gopal varma, twitter controversy, rgv news, pawan kalyan controversy, pawanism, janasena party

Bandla Ganesh Counter Tweets On Ram Gopal Varma Pawan Kalyan Controversy : Bandla Ganesh Has Given Counter Tweets On Ram Gopal Varma To Not Comments On Pawan Kalyan Issue.

వర్మకు దిమ్మతిరిగే కౌంటర్లిచ్చిన బండ్లగణేష్

Posted: 10/12/2015 07:34 PM IST
Bandla ganesh counter tweets on ram gopal varma pawan kalyan controversy

వివాదాస్పద వ్యాఖ్యానాలతో నిత్యం వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. గతకొన్నాళ్ల నుంచి ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్, ఆయన అభిమానులపై సెటైరికల్ కామెంట్స్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవల పవన్ కల్యాణ్, మహేష్ అభిమానుల మధ్య తేడా తెలుపుతూ వర్మ మరో కొత్త సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే! దాంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి అతనికి కౌంటరిస్తూ.. వర్మ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారానికి తెరలేపారు. దానికి వర్మ కూడా తనదైన రీతిలో అప్పట్లో జవాబిచ్చేశాడు. ఆ సంఘటన అంతటితో ముగిసిపోయింది.

కానీ.. అప్పుడే మరో ఆసక్తికరమైన ట్వీట్ తో వర్మ ముందుకొచ్చాడు. ‘వాల్డ్ పవనిజం టు డే’ అని అభివర్ణిస్తూ ‘బాహుబలి’ సినిమా కంటే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ప్రపంచంలోని నలుమూలలకూ వెళ్లాలని కోరాడు. అమెరికా, అర్జెంటీనా, ఐస్‌లాండ్, ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా గబ్బర్‌సింగ్ హవా కొనసాగడం ఖాయమంటూ రాసుకొచ్చాడు. ఈ విధంగా వర్మ చేసిన కామెంట్లపై మండిపడ్డ ప్రొడ్యూసర్ బండ్లగణేష్.. తనదైన స్టైల్లో వర్మకు దిమ్మతిరిగే కౌంటర్లు వరుసగా ఇచ్చాడు. తాను కూడా పవన్‌కల్యాణ్ అభిమానినేనంటూ మొదలుపెట్టిన బండ్ల.. ఆయనలోని నాయకత్వ లక్షణాలను అభినందించింది మొదట మీరేనని వర్మకు తెలిపాడు. అలాగే.. మీరు పవన్ వ్యక్తిత్వానికి ఎంత పెద్ద ఫ్యాన్ అన్న విషయమూ తనకు తెలుసు అంటూ ట్వీట్ చేవాడు. ఇక ఆ తర్వాత ఈ నిర్మాత ఓ చిన్న రిక్వెస్ట్ అంటూ వర్మ బ్యాండ్ బజాయించేశాడు.

పవన్ కల్యాన్ పై రాత్రివేళ ట్వీట్స్ తో నిద్రపాడు చేయవద్దని, పగటివేళ ట్వీట్స్‌తో పని చెడగొట్టవద్దని కోరాడు. పవన్ మీద వచ్చే విమర్శలు మాకు ఊరేగింపులో పడే మల్లెపూలు.. సూర్యుడి మీద ఉమ్మేస్తే.. అంటూ అక్కడితో ఆపాడు. ‘బాహుబలి’ తెలుగు సినిమాకే గర్వకారణమైతే, పవన్ తెలుగు ప్రజలకే గర్వకారణమని అన్నాడు. తెలుగుజాతి రక్షణకు ‘జనసేన’ను ప్రారంభించి తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని, ఆయన స్థానాన్ని ఎవరూ తాకలేరనిచెప్పాడు. మీ మీద విమర్శలు చేయడం క్షణం పట్టదని, పవన్ లాంటి అన్నదాతను విమర్శించడం అవివేకమని గ్రహించండంటూ బండ్ల దుయ్యబట్టాడు. ఏదేమైనా.. ఈ ట్వీట్లలో బండ్ల పవన్ మీదున్న తన అభిమానాన్ని చాటుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bandla ganesh  pawanism  ram gopal varma  pawan kalyan  

Other Articles