North Korea says ready for war with US as it marks anniversary

North korea ready to defend itself against us

North Korea, United States, war, Kim Jong-un, pyongyang, military, parade, anniversary, ,Asia Pacific,World news,Communism

North Korean leader Kim Jong-un declared on Saturday that his country was ready to stand up to any threat posed by the United States, as he spoke at a lavish military parade to mark the 70th anniversary of the North’s ruling party and trumpet his third-generation leadership

ITEMVIDEOS: అగ్రరాజ్యం నుంచి ఎలాంటి బెదిరింపులు వచ్చినా.. సమాధానం ఇస్తాం..

Posted: 10/10/2015 07:24 PM IST
North korea ready to defend itself against us

అగ్రరాజ్యం హుంకరింపులకులకు బెదరింపులకు ఎట్టి పరిస్థితుల్లో జంకకుండా, బెదరకుండా నిఖచ్చిగా సమాధానం ఇచ్చే దేశం ఉత్తర కోరికా. మరోలా చెప్పాలంటే.. అమెరికా వంటి దేశానికి పక్కలో బెల్లం ఉత్తర కోరియా. అనేక ఏళ్లుగా అగ్రరాజ్య అధిపత్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమ వామపక్ష్ భావాజాలంతో రాణిస్తున్న దేశంలో నార్త్ కోరియా. తాజాగా అమెరికా తలపెట్టే ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమంటూ అంతర్జాతీయంగా ఏకాకి అయిన ఉత్తర కొరియా ప్రకటించింది.

ఉత్తర కొరియా అధికార వర్కర్స్ పార్టీ 70వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాజధాని ప్యాంగ్యాంగ్లో భారీస్థాయిలో సైనిక కవాత్తును నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ అధినేత కిమ్ జాంగ్ ఉన్ మాట్లాడుతూ.. 'అమెరికా సామ్రాజ్యవాదులు ఎలాంటి యుద్ధాన్ని తలపెట్టినా దాని ఎదుర్కొనేందుకు పార్టీ రెవెల్యూషనరీ దళాలు సిద్ధంగా ఉన్నాయి' అని చెప్పారు. శక్తివంతంగా సాగిన ఆయన ప్రసంగం ఆద్యంతం రెచ్చగొట్టేరీతిలో సాగింది. గతంలో జాతీయంగా, అంతర్జాతీయంగా పార్టీ నాయకులు, అధికార పార్టీ చేసిన ఘనతలను ఆయన కీర్తించారు. .

ఈ సందర్భంగా కిమ్ 2 సంగ్ స్క్వేర్ వద్ద వేలమంది సైనికుల కవాత్తు, యుద్ధట్యాంకుల ప్రదర్శన.. ఇలా వేడుక అంతా యుద్ధ సన్నాహాన్ని తలపించింది నిరుపేద దేశమైన ఉత్తర కొరియా, ధనిక ప్రజాస్వామిక దేశమైన దక్షిణ కొరియా బద్ధ శత్రువులుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య 1950-53లో జరిగిన యుద్ధం ముగిసినా సంధి ఒప్పందం కుదరలేదు. దీంతో భారీస్థాయిలో అణ్వాయుధాలు, రాకెట్లు పోగుచేసుకున్న ఉత్తర కొరియా దక్షిణ కొరియాను ధ్వంసం చేస్తానని ప్రకటించడంతో ఆ దేశంపై అమెరికా, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే తీవ్ర ఆంక్షలు విధించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North Korea  United States  war  pyongyang  Kim Jong-un  

Other Articles