MBA And Degree Holders Runs For Watchmen Jobs In Vizag Electrical Department | Govt Jobs Updates | MBA Holders

Mba degree holders runs for watchmen jobs in vizag

vizag watchmen jobs, mba holders runs for watchmen jobs, vizag jobs offers, vizag electrical department, vizag students run for watchmen jobs, vizag watchmen jobs, vizag job holders, mba holders runs for wathmen

MBA Degree Holders Runs For Watchmen Jobs In Vizag : MBA And Degree Holders Runs For Watchmen Jobs In Vizag Electrical Department.

వాచ్‌మన్ జాబ్ కోసం ఎంబీఏ అభ్యర్థుల పరుగు

Posted: 10/10/2015 12:10 PM IST
Mba degree holders runs for watchmen jobs in vizag

అవును.. పదోతరగతి అర్హత గల వాచ్ మన్ ఉద్యోగం కోసం ఏకంగా ఎంబీఏ అబ్యర్థులు పరుగులు తీశారు. ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఉద్యోగాల పరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో ప్రభుత్వుద్యోగాల కరువు ఎంత మేర వుందో! ఆమధ్య ఉత్తరప్రదేశ్ లో ప్యూన్ ఉద్యోగానికి పీ.హెచ్.డీ హోల్డర్లు సహా లక్షల మంది అభ్యర్థులు పోటీపడితే.. ఇప్పుడు వాచ్‌మన్ జాబ్ కోసం వందలాదిమంది డిగ్రీ, ఎంబీఏ అభ్యర్థులు పరుగు తీసి వార్తల్లోకెక్కారు.

విశాఖపట్టణం జిల్లా విద్యుత్ శాఖలో ఖాళీగా వున్న రెండు నైట్ వాచ్ మన్ పోస్టులను భర్తీ చేయడం కోసం ఆ శాఖ శుక్రవారం పరుగుపందెం నిర్వహించింది. ఈ పందెంలో డిగ్రీ ఏం ఖర్మ.. ఎంబీఏ పాసైన అభ్యర్థులు కూడా పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలాకాలం నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన అభ్యర్థులకు.. ఇంతలోనే విద్యుత్ శాఖలో వాచ్‌మన్ ఉద్యోగాల కోసం రిక్రూట్ మెంట్ నిర్వహించనున్నారనే విషయం తెలియగానే.. అర్హత తగ్గ ఉద్యోగం కాకపోయినా పరుగు పోటీలో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు.

జిల్లా విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఒక పోస్టు, ఏపీఈపీడీసీఎల్ జిల్లా హెడ్ ఆఫీస్‌లో మరో పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు 462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యుత్ శాఖ డిపార్టుమెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ముడసర్లోవ వద్ద బీఆర్‌టీఎస్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఆ శాఖ అధికారులు అభ్యర్థులకు పరుగు పోటీలు నిర్వహించారు. శనివారం హెడ్ ఆఫీస్‌లో వాచ్‌మన్ ఉద్యోగం కోసం పరుగు జరగనుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mba holders run for wathment  vizag electrical department  

Other Articles