jharkhand maoists kill 20 year old girl who chose school over guns

Jharkhand girl chose books over rifles maoists kill her

Former Maoist leader Sanjeeta Kumari, Sanjeeta Kumari alias guddi, Maoists, Jharkhand, Gumla, All Jharkhand Students' Union, Bihar Maoists, CRPF, Malala Yousafzai, indian malala Guddi

She could have been India’s Malala Yousafzai, leaving behind a life of Maoist violence she was lured into as a child, to start afresh, enrolling herself in school for studies.

ఇండియన్ మాలాలను హతమార్చారు.. మావోలు తాలిబన్ల కన్నా కఠినాత్ములా..?

Posted: 10/09/2015 09:21 PM IST
Jharkhand girl chose books over rifles maoists kill her

మావోలు తాలిబన్ల కన్నా కఠినాత్ములా..? ఇప్పుడీ ప్రశ్న అనేక మందిలో ఉత్భవించక మానందు. పాకిస్థాన్ లో తాలిబన్లు చదువుల తల్లి మాలాలాపై తుపాకుల గుళ్ల వర్షం కురిపించినట్లు.. భారత్ లో కూడా జరుగుతుందా..? మన భారతదేశం గోప్పది. చదువుకునే వారిని ప్రోత్సహిస్తారు తప్ప.. హతమార్చరన్న భారతీయుల నమ్మకాన్ని మావోలు ఒమ్ము చేశారు. చదువుల తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆ యువతి కలల్ని చిదిమేశారు. తీవ్రవాద ఉద్యమాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసి బాగా చదువుకోవాలని ఆరాటపడిన ఆ యువతిపై తుపాకీ గుళ్లను కురిపించింది మట్టుబెట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్లోని గుమ్లాకు చెందిన సంగీత కుమారి బాల్యదశలోనే మావోయిస్టు పార్టీలోకి వెళ్లింది. ఇంటి పక్కనే ఉండే మావోయిస్టు నేత సవిత ద్వారా ఆమె పార్టీలో చేరింది. వంట చేయడంతో మొదలుపెట్టి, తర్వాత షార్ప్ షూటర్గా ఎదిగింది. మావోయిస్టుగా ఆమె చాలాకష్టాలను అనుభవించింది. ఒకసారి లాతేహార్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. తను  ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందామనేలోపు అదడు ఎన్కౌంటర్లో చనిపోయాడు.  దాంతో బయటకు వచ్చి చదువుకుని మంచి జీవితాన్ని కొనసాగించాలని ఆశపడింది. దానికోసం నాలుగు రోజులు అవిశ్రాంతంగా నడిచింది. చివరికి గత ఏప్రిల్ నెలలో గుల్మాకు  చేరుకుని అక్కడ రహస్యంగా తలదాచుకుంది.  చంపేస్తామన్న బెదిరింపులను లెక్కచేయకుండా స్కూల్లో చేరింది. కాగా గత మంగళవారం తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు ఆమె స్వగ్రామం సిబిల్ చేరింది. కానీ అప్పటికే మావోయిస్టు నేతలు ఆమె కుటుంబసభ్యులను కిడ్నాప్ చేశారు. సంగీతనూ చంపేస్తామని బెదిరిస్తూ లేఖ వదిలిపోయారు.

గురువారం ఉదయానికి వారు అన్న మాట అక్షరాల నిజమైంది. సంగీత కుమారి కూడా శవమై తేలింది. రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించి  ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. గతంలో సంగీత మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. దళాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దోపిడీ, బలవంతపు అబార్షన్లు చాలా సర్వసాధారణమని తెలిపింది. అందుకే తనకు నచ్చలేదని.. మళ్లీ  హింసాత్మక ఉద్యమాల వైపు వెళ్లనని చెప్పింది. అదే సందర్భంగా తమ బాస్లు తనను బతకనివ్వరనే భయాన్ని కూడా వ్యక్తం చేసింది. చివరికి ఆమె భయమే నిజమైంది. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఆమెను కాల్చి చంపినట్టు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoist leader  Sanjeeta Kumari  killed  study  

Other Articles