Lalu terms suit filed against him over beef jibes as 'matter of pride'

Swadhu ramdev is a dealer of medicines says lalu

Lalu Prasad Yadav,Brinda Karat,Lalu Prasad,BJP,CPI , 'Swadhu' Ramdev is a dealer of medicines, says Lalu,news, Ramdev most dangerous than RSS, animal bones in ramdev medicines,

Rashtriya Janata Party (RJD) chief Lalu Prasad Yadav on Wednesday alleged that Yoga Guru Baba Ramdev, who follows the stance of the ruling BJP at the Centre, is a dealer of medicines.

ఔషదాల విక్రయదారుడు బాబా రాందేవ్.. ఆరెస్సెన్ కన్నా ప్రమాదకారి..

Posted: 10/07/2015 07:01 PM IST
Swadhu ramdev is a dealer of medicines says lalu

బీహర్ ఎన్నికలలో గెలుపుకోసం పరుగులు తీస్తున్న కూటములు, పార్టీలు..  ఎన్నికలకు సమయం అసన్నమవుతన్న నేపథ్యంలో అంతే స్థాయిలో ప్రత్యర్థి పార్టీలపై వాటిని సమ్మతిస్తున్న ప్రచారబాధ్యతలు నిర్వహిస్తున్నవారిపై విమర్శలను ఎక్కుపెడుతున్నాయి. బీజేపీని సమర్థిస్తున్న బాబా రాందేవ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కంటే ప్రమాదకరంగా మారారని ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోపించారు. బీహార్‌ ఎన్నికల ప్రచారానికి వస్తున్న బాబా రాందేవ్‌పై ఆయన మండిపడ్డారు. రాందేవ్‌ తను విక్రయించే ఔషదాల్లో గోల్‌మాల్‌ చేస్తున్నారని లాలూ అన్నారు. పైగా సీపీఎం నేత బృందా కారత్‌ కూడా ఇదే అరోపణలు చేశారని లాలూ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ సందర్భంగా లాలూ మీడియాతో మాట్లాడుతూ ఆరెస్సెస్‌ను మించి కరుడుగట్టిన హిందూత్వవాది రాందేవ్‌ అని అన్నారు. ఔషధాల్లో పశువుల ఎముకలు కలిపి అమ్ముతున్నారని బృందా కారత్‌ అన్న విషయాన్ని లాలూ గుర్తు చేశారు. పశువుల ఎముకలైనా... మనిషి ఎముకలైనా తేడా ఏముందని ఆయన అన్నారు. నల్లధనం విషయంలో రాందేవ్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని లాలూ ప్రశ్నించారు. బాబా సాధువు కాదని... సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తి అని, ఆయన అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్‌ చేశారు. యోగా గురుపు ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాల కోసమే బీజేపికి మద్దతునిస్తున్నాడని దుయ్యబట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  Brinda Karat  baba Ramdev  animal bones  medicines  

Other Articles