Farmers to Begin Rail Blockade Today

Farmers rail blockade

farmers, Suicides, Punjab, Badal Govt, Punjab farmers, Rails in Punjab, Protest at Rails

Farmer groups in Punjab are planning to block rail traffic at several places across the state for two days starting today, in protest against the state government's "anti-farmer" policies. Four trains have already been cancelled and 12 have been diverted ahead of the planned blockade.

రైతులు రైళ్లు బంద్ చేయిస్తున్నారు

Posted: 10/07/2015 10:51 AM IST
Farmers rail blockade

పట్టెడన్నం పెట్టే రైతన్న కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుంది..? రైతులు ఆగ్రహిస్తే రాజ్యాలకు రాజ్జాలు దద్దరిల్లుతాయి.. అధికారంలో ఉంటున్న ప్రజాప్రతినిధులకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. తాజాగా పంజాబ్ లో రైతులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. అక్కడి ప్రభుత్వం తీసుకువస్తున్న రైతు వ్యతిరేక విధానలకు రైతులు ఉద్యమబాట పట్టారు. రైతులకు తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రైళ్లను అడ్డుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు రైళ్లను రద్దు చేసిన అధికారులు.. మరో 12 రైళ్ల రూట్ మార్చారు. మొత్తానికి అక్కడి రైళ్ల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ రైల్లను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నేడు, రేపు రెండు రోజులపాటు రైళ్లను అడ్డుకుంటున్నారు పంజాబ్ రైతులు. పంట నష్టపోయిన రైతులకు 40 వేల రూపాయలు, రైతు కూలీల కుటుంబాలకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఐదు లక్షల చొప్పున పరిమారం చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనలతో రాంపరా, మాన్సా, సునమ్, మోగ, బీస్, పిల్లువార్, ఫాజిల్క, ఫిరోజిపూర్, పటియాలాలలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  Suicides  Punjab  Badal Govt  Punjab farmers  Rails in Punjab  Protest at Rails  

Other Articles