A Former CBI Officer Arun Kumar Has Creates Sensation By Commenting On Arushi Talwar Case | Mumbai Crime News

Former cbi officer arun kumar came with new twist in arushi talwar case

arushi talwar case, arushi talwar parents, arushi talwar mystery case, cbi officer arun kumar, arushi talwar cbi arun kumar, arun kumar latest updates, cbi officer arun kumar comments, arushi talwar murder case, mumbai murder case, mumbai police investigation

Former CBI Officer Arun Kumar Came With New Twist In Arushi Talwar Case : A Former CBI Officer Arun Kumar Has Creates Sensation By Commenting On Arushi Talwar Case. He Said That Her Parents Are Not Convicts In The Case.

ఆరుషి ‘తల్వార్’ కేసులో సిబిఐ అధికారి మెలిక

Posted: 10/06/2015 12:59 PM IST
Former cbi officer arun kumar came with new twist in arushi talwar case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్యకేసులో ఓ సిబిఐ అధికారి తాజాగా ఒక మెలిక పెట్టారు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకంటే ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగిన ఈ కేసు విచారణ ఇంకా తుదిదశకు రానే లేదు. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులే దోషులని అనుమానాలు వున్నాయి కానీ.. అందుకు తగిన ఆధారాలు ఇంకా దొరకలేదు. ఏదేమైనప్పటికీ.. వారు ఈ కేసు విచారణలో భాగంగా మూడేళ్లపాటు పోలీస్ కస్టడీలో వుండి.. ఇటీవలే విడుదలయ్యారు. అయినప్పటికీ.. వారే దోషులు అయివుంటారని అనుమానాలు ఇంకా వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ కేసును మొట్టమొదట విచారించిన ఓ సిబిఐ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ కేసును దర్యాప్తు చేసిన జాయింట్ డైరెక్టర్, ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్న అరుణ్ కుమార్ తాజాగా ఈ కేసుపై తన అభిప్రాయాన్ని స్పందిస్తూ.. దోషులుగా ముద్రపడి జైలు శిక్ష అనుభవించిన ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులని వ్యాఖ్యానించారు.

‘నేను ఈ అభిప్రాయానికి రావడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో.. హేమరాజ్ మృతదేహం అరుషి మృతదేహంతో పాటే లభించలేదు. అలాగే ఈ కేసులో ఫోరెన్సిక్ నమూనాల సేకరణ జరగలేదు. అదే జరిగివుంటే నిజం ఎంతో సులభంగా వెల్లడయ్యుండేది’ అని అరుణ్ కుమార్ అన్నారు. ‘ఈ కేసును విచారించిన రెండు సీబీఐ టీమ్ లూ ఎన్నటికీ ఒకే మాటపైకి రాలేదు. ఒక టీం అరుషిని హత్య చేసేందుకు వారి తల్లిదండ్రులు సహకరించారని చెప్పగా... రెండో టీమ్ పనివాడు హేమరాజ్ తో కలసి ఉన్న అరుషిని చూసిన తరువాత తల్లిదండ్రులే హత్య చేశారని చెప్పారు’ అని అన్నారు. సీబీఐ డైరెక్టర్ అశ్వని కుమార్ కేసు బాధ్యతలు స్వీకరించాక పరిస్థితి మొత్తం మారిపోయిందని ఆయన ఆరోపించారు. కేసు విచారణను ముగించే సమయంలో తనను అభిప్రాయం కోరారని.. అప్పుడు ఆయన "ఈ నేరంలో అరుషి తల్లిదండ్రులకు సంబంధమున్నట్టు ఒక్క ఆధారం కూడా లేదు’ అని స్పష్టం చేసినట్లు చెప్పారు. కానీ.. తాను ఎంతగా మొత్తుకున్నప్పటికీ.. ఎవరూ తన వాదనను వినలేదని అరుణ్ ఆరోపించారు.

అయితే.. డైరెక్టర్ల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగానే కేసు తప్పుదారి పట్టిందా? అన్న ప్రశ్నకు అరుణ్ కుమార్ సమాధానం ఇవ్వలేదు. కాగా, ఈ కేసు ఆధారంగా నిర్మితమై ఇటీవల విడుదలైన 'తల్వార్' చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో అరుణ్ కుమార్ పాత్రను ఇర్ఫాన్ ఖాన్ పోషించాడు. ఈ సినిమా విడుదలై మంచి విజయంతో దూసుకుపోతున్న నేపథ్యంలో స్పందించిన అరుణ్ కుమార్.. ఆ చిత్రంలో ఇర్ఫాన్ చెప్పిన డైలాగులే ఇప్పుడు ఈయన నోటివెంట రావడం గమనార్హం.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles