Hindu devotees help Muslim woman give birth in Ganpati temple

Muslim woman give birth in ganpati temple

Mumbai, Hindu, Muslim, Delevery, Muslim birth in Temple

While the nation might be consumed by news of communal hatred, as a man in Dadri was allegedly killed for consuming beef (which he didn’t), there are incidents of harmony which remind us that the idea of India will never die. Recently, according to a report in Mid Day, a group of Hindu devotees in Mumbai helped a Muslim woman give birth. Apparently, the woman was forced out of her after the taxi driver panicked that she was going to give birth in his car.

ITEMVIDEOS: గుడిలో ముస్లిం మహిళ డెలివరి

Posted: 10/05/2015 02:50 PM IST
Muslim woman give birth in ganpati temple

మతాలు వేరు.. కానీ ఎవరికై ఉండాల్సింది మాత్రం మానవత్వం. అందుకే మానవత్వాన్ని మించిన మతం ఇంకోటి లేదని అంటారు. అలాంటి ఘటనే ఒకటి ముంబైలో చోటుచేసుకుంది. మతాల పేరుతో మారణహోమం సృష్టించే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు స్థానిక మహిళలు. పురిటి నొప్పులతో రోడ్డు పక్కన ఉన్న ఓ బాలింకతకు ఆ గుడే ఆశ్రయం కల్పించింది. తల్లీబిడ్డలను కాపాడి వారికి ప్రాణదానం చేసింది. ముంబైలోని ఓ బస్తీలో ఉంటున్న ఓముస్లిం బాలింతకు పురిటినొప్పులు వచ్చాయి. దాంతో ఆస్పత్రికి వెళ్లేందుకు ట్యాక్సీ మాట్లాడదామని భర్త ఆరాట పడుతున్నారు. కానీ భార్య పురటినొప్పులకు తాళలేకపోయింది. అక్కడే కుప్పకూలింది. అయితే పక్కనే ఉన్న కొంత మంది హిందు మహిళలు ఆమెను దగ్గరలోని గణపతి గుడిలోకి తీసుకెళ్లారు.

బాలింత అని మానవత్వం సాటి మహిళల్లో కరుణను కురిపించింది. దాంతొ ఆ గుడిలో కొంత మంది మహిళలు కలిసి ముస్లిం మహిళకు డెలివరీ చేశారు. బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే మత విశ్వాసాలతో కొట్టుకుచస్తున్న కాలంలో ఇలాంటివి చోటుచేసుకొవడం ఆశ్చర్యం. అయితే ఇందులో కొస మెరుపు ఏంటంటే.... పుట్టిన బిడ్డకు గణేష్ అని పేరు పెట్టుకున్నారు ముస్లిం దంపతులు. దేవుడు ఎలా ఉన్నా మనిషిలో ఉన్న మానవత్వమే దైవత్వానికి ప్రతీక అన్న దానికి నిలెవెత్తు సాక్షం ఈ ఘటన.

*అభిపవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Hindu  Muslim  Delevery  Muslim birth in Temple  

Other Articles