పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం రెండు మూగ జీవాలను బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తులు అతి ప్రదర్శించారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో రఘువీరా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేసి విమర్శల పాలయ్యారు. అంతేకాదు విమర్శలు కార్యకర్తలకు కాకుండా స్వయంగా రఘువీరారెడ్డిని కూడా ముంచెత్తాయి. స్వయంగా ఆయన సమక్షంలోనే ఈ రెండు హత్యలు జరగడం కలకలం రేపుతోంది.
ఇంతకీ ఏం చేశారంటున్నారా..? రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు బాణాసంచా పేల్చారు. అయితే అందులోని రెండు తారాజువ్వలకు రెండు పావురాలను కట్టారు. ఇంకేముంది వాటికి కూడా నిప్పుపెట్టి పెకి ఎగురవేశారు. తారాజువ్వల ధాటికి ఆ రెండు పావురాలు కాసేపట్లోనే నేలకొరిగాయి. అయితే ఈ సమయంలో రఘువీరారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఆయన ఏమీ మాట్లాడకపోవటంతో ....ఆర్భాటం కోసం పక్షుల ప్రాణాలు తీస్తారా అంటూ వన్యప్రాణి సంరక్షణ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు స్థానికుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more