wrist watch that costs more than 5 crores

Wrist watch with no special features costs more than rs five crore

wrist watch, 5 crores watch, no diamonds, golden watch, platinum watch, wacth made of platinum, watch made of gold, wacth with diamonds, expensive watch

wrist watch that costs more than Ruppees 5 crore, with no special features or expensive metals in it.

ఐదు కోట్ల రూపాయల చేతి గడియారం.. రేటు అధికం.. ప్రత్యేకతలు..

Posted: 10/02/2015 05:31 PM IST
Wrist watch with no special features costs more than rs five crore

చేతి గడియారం.. అదే ఒకానోకప్పుడు పెళ్లిళ్లలో వరుడికి పెట్టే కట్నం. మిగిలిన లాంఛనాలతో పాటు వరుడి చేతికి వాచీ పెట్టనిదే పెళ్లిళ్లు జరిగేవి కూడా కాదు. పెళ్లి కోడుకు అలిగి వెళ్లిపోయేవాళ్లు కూడా. చివరకు అతన్ని బతిమాలి, బామాలి వధువు బందువులు ఏదోలా ఓప్పంచేవారు. అయితే ఇవన్నీ సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో కనిపించే ఒకనాటి మధుర ఘటనలు. అరోజుల్లో పెళ్లి కోడుకు వాచి పెట్టాడంటే అదే సోషల్ స్టేటస్ సింబల్. ఇలా మధ్య తరగతి వారితో దశాభ్తాల క్రితం నుంచే అనుబంధాన్ని పెనవేసుకు్నాయి.

అయితే ఇప్పుడీ ప్రస్దావన ఎందుకుని అంటారా..? ఎవరైనా వాచీని ఎంత పెట్టి కొంటారు? మామూలుగా అయితే కొన్ని వందలు.. అదే మీరు బాగా ముచ్చటపడి, ఏ పెళ్లికో.. లేదా ఇతర అకేషన్లకో అయితే కొన్ని వేలు పెట్టి కొంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న వాచీ కొనాలంటే మాత్రం వందలు, వేలే కాదు లక్షలు కూడా చాలవు.. దీని విలువ అక్షరాలా దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలు. ఇంతటి ఘనమైన రేటు పలుకుతుందంటే.. ఈ వాచీ ప్రత్యేకతలేమిటీ అన్న సందేహాలు రేకెత్తకమానవు. అయితే దీని రేటు మాత్రమే అధికం.. ప్రత్యేకతలు మాత్రం పూజ్యం. ఎందుకంటే ఇది ఖరీదైన లోహాలతోనూ చేసిందికాదు. ఎలాంటి వజ్రాలు, రత్నాలు మణి మాణిక్యాలు పొదగబడి లేవు. అయినా కూడా దాని ఖరీదు దాదాపు రూ. 5.50 కోట్లు.

గ్రూబెల్ ఫోర్సీ క్వాడ్రాపుల్ టర్బిలిన్ అనే కంపెనీకి చెందిన ఈ వాచీలో కేవలం నాలుగంటే నాలుగే మోడళ్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఏడాదికి కేవలం ఐదు నుంచి ఆరు వాచీలను మాత్రమే తయారుచేస్తుందట. అయినా కూడా ఈ వాచీకి ఎందుకు అంత ధర పెట్టారో మాత్రం తెలియడంలేదు. అసలీ వాచీ ఎలా తయారు చేయాలన్న ఆలోచన ఫైనల్ కావడానికే ఐదేళ్లు పట్టిందని, ఇందులో నాలుగు టర్బిలిన్ కేజెస్ పెట్టామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దానివల్ల వాచీ పెర్ఫార్మెన్సు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. మొత్తానికి ఇలాంటి విశేషాలన్నీ ఉండబట్టే ఈ వాచీకి ఐదున్నర కోట్ల ధర పెట్టారన్నమాట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wrist watch  5 crores watch  no diamonds  

Other Articles