Salman Khan Makes Interesting Comments On His Marriage Issue | Bollywood Updates | Bigg Boss 9 Reality Show | Prem Ratan Dhan Payo

Salman khan interesting comments on his marriage bollywood updates bigg boss 9

salman khan, salman khan marriage, salman khan marriage issue, salman khan movies, salman khan bigg boss 9, salman khan movie updates, salman khan photos, salman khan marriage controversy, Prem Ratan Dhan Payo movie updates, Prem Ratan Dhan Payo stills

Salman Khan Interesting Comments On His Marriage Bollywood Updates Bigg Boss 9 : Salman Khan Makes Interesting Comments On His Marriage Issue In Bigg Boss 9 promotional event, Mumbai.

తన పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సల్మాన్

Posted: 09/30/2015 03:45 PM IST
Salman khan interesting comments on his marriage bollywood updates bigg boss 9

బాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా పేరుగాంచిన కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో తన పెళ్లి విషయమై సమాధానాలు దాటవేసిన సల్లూ భాయ్.. ఈసారి కొన్ని ఆసక్తికకరమైన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ చెప్పిన జవాబులకు అటు మీడియాతోపాటు అభిమానులు షాక్ కు గురయ్యారు. ఇంతకీ అతను ఏం చెప్పాడు? పెళ్లి చేసుకుంటాడా లేదా? పెళ్లిపై అతని అభిప్రాయం ఏంటి? అనే వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాలో నటిస్తున్న సల్మాన్.. ‘బిగ్ బాస్-9’ రియాల్టీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ షో కోసం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్ లో భాగంగా ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో.. సల్మాన్ తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత తరంలో ‘పెళ్లి’ అనేది జీవితకాల బంధం కాదని సల్లూ భాయ్ తేల్చి చెప్పేశాడు. ఒకవేళ తాను పెళ్లి చేసుకోవాల్సి వస్తే.. పర్మినెంట్ పెళ్లి చేసుకోవాలా? లేక టెంపరరీ పెళ్లి చేసుకోవాలా? అని మీడియా వారినే ప్రశ్నించాడు.

ఈ సందర్భంగా కొందరు పర్మినెంట్ పెళ్లి చేసుకోమని సలహా ఇష్తే.. మరికొంతమంది టెంపరరీ పెళ్లి చేసుకోమని చెప్పారు. కానీ.. వీరందరికంటే భిన్నంగా మరికొంతమంది అసలు పెళ్లే చేసుకోవద్దంటూ సలహా ఇచ్చారు. ఇలా వచ్చిన సలహాలన్నింటిని విన్న తర్వాత సల్మాన్ స్పందిస్తూ.. ‘మీరు నన్ను పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేస్తున్నారో? లేక కన్ఫ్యూజ్ చేస్తున్నారో? అర్థం కావడం లేదని సరదాగా వ్యాఖ్యానించాడు. మొత్తానికి సల్మాన్ పెళ్లి చేసుకోనని ఇండైరెక్ట్ గా చెబుతున్నట్లు అర్థం చేసుకోవాల్సిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan marriage  bigg boss 9 reality show  Prem Ratan Dhan Payo  

Other Articles