TDP Leader Revanth Reddy Make Controversial Comments On TRS Party and Telangana Police | Telangana Assembly Sessions

Revanth reddy controversial comments trs telangana police

revanth reddy, tdp leader revanth reddy, trs party, kcr news, kcr controversy, telangana police, telangana assembly session, errabelly dayakar rao, telangana leaders

Revanth Reddy Controversial Comments TRS Telangana Police : TDP Leader Revanth Reddy Make Controversial Comments On TRS Party and Telangana Police.

ఆ ధైర్యం లేకపోవడం వల్లే రేవంత్ ని టార్గెట్ చేశారట!

Posted: 09/29/2015 12:41 PM IST
Revanth reddy controversial comments trs telangana police

తెలంగాణ టీడీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో తాను మాట్లాడితే తన కళ్లలో చూసే ధైర్యం లేకేపోవడం కారణంగానే తనను టార్గెట్ చేస్తున్నారని సీఎం కేసీఆర్, ఆయన కేబినెట్ సహాచరులపై రేవంత్ మండిపడ్డారు. మంగళవారం ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ కు తన పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకపోవడం వల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని మంత్రులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్పై మండిపడ్డారు. కేసీఆర్ మంత్రి వర్గంలో కొనసాగుతున్న తలసాని శ్రీనివాసయాదవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 8 నెలలు అయిందని... అయినా తెలంగాణ శాసనసభ స్పీకర్ తలసాని రాజీనామాను ఆమోదించ లేదన్నారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి... మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల అంశంలో అనర్హత పిటిషన్పై హైకోర్టు వెలువరించిన తీర్పు స్పీకర్కు సూచనగా భావిస్తున్నామని రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. గులాబీ పార్టీ నేతలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు తేడా తెలియకుండా వ్యహరిస్తున్నారని విమర్శించారు. పీజీ చదువుతున్న విద్యార్థులను కాల్చి చంపడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని రేవంత్ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ సందర్భంలో పోలీసుల ప్రస్తావన తీసుకొస్తూ.. వారందరూ అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారంటూ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మీ విధులు మీరు నిర్వహించండి... టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదం’టూ పోలీసులకు రేవంత్రెడ్డి హితవు పలికారు. మరి.. ఈ విధంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ఎంతవరకు దుమారం రేపుతాయోనని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  kcr updates  telangana assembly  

Other Articles