Andhra Pradesh CID Has Given Good News For Agri Gold Victims | Inidia Scams

Good news for agri gold victims andhra pradesh cid

agri gold scam, india scams, india biggest scams, agri gold controversy, agri gold victims, agri gold news, agri gold latest updates, andhra pradesh cid, andhra pradesh high court

Good News For Agri Gold Victims Andhra Pradesh CID : Andhra Pradesh CID Has Decided To Give Back Money To Agri Gold Victims.

‘అగ్రిగోల్డ్’ బాధితులకు శుభవార్త

Posted: 09/28/2015 10:44 AM IST
Good news for agri gold victims andhra pradesh cid

అగ్రిగోల్డ్ కుంభకోణం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ స్కామ్. ఈ కుంభకోణంతో ఎంతోమంది రోడ్డునపడ్డారు. ఇందులో ఏజెంట్లుగా పనిచేసినవాళ్లందరూ తమ ఇళ్లు వదులుకుని తలలు దాచుకుని తిరుగుతుండగా.. పెట్టుబడులు పెట్టుకున్నవారంతా లబోదిబోమంటూ బ్రాంచీలముందు గోడు వెళ్లబోసుకున్నారు. భవిష్యత్ కోసం తమ కష్టార్జితాన్ని ఎంతో నమ్మకంగా అందులో డబ్బులు జమచేస్తే.. ఆ ఆశలు నీరుగారాయంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కుంభకోణంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇలా ఎంతోమంది ఈ కుంభకోణం బారినపడ్డ బాధితులకు ఇప్పుడో శుభవార్త. ఆ సంస్థలో తక్కువ మొత్తాలను పెట్టుబడిగా పెట్టిన వారి నుంచి మొదలుకుని మధ్య తరగతి బాధితుల వరకు మొత్తం 20 లక్షల మందికి త్వరలో చెల్లింపులు జరగనున్నాయి. ఈ మేరకు వచ్చే నెలలోనే తొలి విడత చెల్లింపులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఏర్పాట్లు చేస్తోంది.

హైకోర్టు అనుమతితో తొలి విడతలో దాదాపు రూ.1200 నుంచి రూ.1400 కోట్ల ఆస్తులను వేలం వేయనున్నట్టు ఏపీ సీఐడీ అదనపు డీఐజీ తిరుమలరావు వివరించారు. వీటిని విక్రయిస్తే.. దాదాపు రూ. 2 వేల కోట్ల వరకూ వస్తుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. వెబ్‌ సైట్‌ లో డిపాజిటర్ల పేర్లను నమోదు చేస్తామని, తొలుత చిన్న డిపాజిటర్లకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. మొత్తం డిపాజిటర్ల సంఖ్య 32 లక్షల వరకూ ఉందని, ముఖ విలువ ప్రకారం ఆస్తుల విలువ రూ. 7,500 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఆస్తుల అమ్మకంపై నిర్ధారణకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని... త్వరలోనే మధ్యంతర ఉత్తర్వులు వెలువడతాయని భావిస్తున్నామని ఆయన వివరించారు. ఆ వెంటనే వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని డీఐజీ స్పష్టం చేశారు. దీంతో.. ‘అగ్రిగోల్డ్’ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నీరుగారిన తమ ఆశలను మళ్లీ చిగురించేలా చేశారని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agri gold scam  india biggest scams  andhra pradesh cid  

Other Articles