Social media is reducing social barriers, says PM Modi

Pm modi praises tech giants for removing social barriers

prime minister narendra modi, modi silicon valley, modi ceo meet, modi meets silicon valley ceos, pm modi silicon valley, pm modi san jose, google ceo, google sundar pichai, sundar pichai pm modi, satya nadella, satya nadella microsoft ceo, Barack Obama, Digital India, facebook, Google, India, PM Narendra Modi, San Jose

Social media is reducing social barriers," Modi said. "Today, technology is advancing citizen empowerment. Technology is forcing governments to deal with massive amount of data and respond in not 24 hours but 24 minutes," he said

సామాజిక అడ్డుగోడలు తొలగింపులో సోషల్ మీడియా కీలకం

Posted: 09/27/2015 01:25 PM IST
Pm modi praises tech giants for removing social barriers

సోషల్‌ మీడియా వల్ల సామాజిక అడ్డుగోడలు తొలగిపోతున్నాయని భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అన్నారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్ సహా ప్రముఖ సంస్థల సీఈవోలు ప్రధానితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ గూగుల్ సహకారంతో 500 రైల్వేస్టేషన్లలో ఉచితవైఫై సదుపాయం కల్పించామని, జనసమర్థ ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలను వైఫైతో అనుసంధానం చేస్తామన్నారు. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగిస్తామని ఆయన తెలిపారు. డిజిటల్ ఎకనామీలో భారత్-అమెరికా భాగస్వామ్యానికి ఈ వేదిక నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాలో ఇంతమంది సీఈవోల సమావేశం కొత్త ఆవిష్కరణకు తెరతీయనుందన్నారు. కొత్త ప్రపంచంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్ మన ఇరుగుపొరుగులాంటివని, ఇంటర్‌నెట్ వల్ల వేగమైన, ఉత్తమ పాలన అందించగలుగుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

మైక్రోసాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని, శ్రీకాకుళం జిల్లాలోని స్కూల్‌లో స్కైప్ ద్వారా తరగతులు నిర్వహించటం అద్భుతమన్నారు. గ్రామాలకు తక్కువ ఖర్చుతో బ్రాడ్ బాండ్ సదుపాయం కల్పించాలని, ఏపీలో డ్రాపవుట్స్ వివరాలు తెలుసుకునేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారని, చిన్న వ్యాపారులకు క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. క్వాల్‌కామ్‌ సీఈవో పాల్‌ జాకబ్స్‌ మాట్లాడుతూ డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. స్మార్ట్‌ ఫోన్ల వినియోగంలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని అన్నారు. భారత అభివృద్ధికి మోదీ రాయబారి అని సిస్కో సీఈవో పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  Digital India  facebook  Google  India  PM Narendra Modi  San Jose  

Other Articles