kasturabha teachers alleged student is pregnant, given tc

Teachers blame 10th class student as pregnant given tc

student, 10 class, mensuration, pregnant, teachers, kurnool kusturibha high school, minority student, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

kurnool kasturabha teachers issues TC to tenth class student alleging that she is pregnant after anm treatment

విద్యార్థినిపై నిందవేసి.. టీసీ ఇచ్చి పంపించిన కస్తూరిభా పాఠశాల..

Posted: 09/26/2015 05:28 PM IST
Teachers blame 10th class student as pregnant given tc

అభంశుభం తెలియని ఓ విద్యార్థినిపై నింద వేశారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. పదో తరగతి చదువుతున్న అమెను తీవ్ర మనోవేధనకు గురిచేయడంతో పాటు .. పాఠశాలలో చదవడానికి వీలులేదంటూ తొందరపాటు నిర్ణయం కూడా  తీసుకున్నారు. దీంతో అమె తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఉపాధ్యాయులు వేసిన నిందను బాపుకునేందుకు విద్యార్థి, అమె తల్లిదండ్రులు రెండు ఆసుపత్రులలో అమెకు వైద్య పరీక్షలు చేయించి ఆ రిపోర్టలను పాఠశాల యాజమాన్యాయనికి అందజేయడంతో.. చేతులు కాలక అకులు పట్టుకునేందుకు ఉపాధ్యాయులు విషయాన్ని భయటకు రానీయకుండా గోప్యంగా వుంచేందుకు ప్రయతన్నాలు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలోని ఓ మైనార్టీ కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులు.. 10వ తరగతి చదువుతున్న బాలికకు రెండు నెలలుగా రుతుస్త్రావం ఆగిపోవడంతో విషయాన్ని పాఠశాల ఇన్‌చార్జికి తెలిపారు. స్థానిక ఏఎన్‌ఎం బాలికను ఈనెల 11 న బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. విద్యార్థిని గర్భం దాల్చిందని రిపోర్టు ఇవ్వడంతో తల్లిదండ్రులను పిలిపించి 13వ తేదీన బాలికకు టీసీ ఇచ్చి పంపించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థిని సహా అమె తల్లిదండ్రులు మరో చోట వైద్యపరీక్షలు చేయించారు

కొలిమిగుండ్లలోని శుశ్రుత డయాగ్నోస్టిక్‌, జమ్మలమడుగులోని వెంకటసాయి భరద్వాజ హాస్పిటల్‌లో 14వ తేదీన పరీక్షలు చేయించారు. గర్భం ధరించలేదని రిపోర్టు ఇచ్చారు. 23వ తేదీ నంద్యాల జిల్లా వైద్యశాలలో కూడా పరీక్షలు చేయించారు. గర్భిణి కాదని తేలింది. దీంతో తమ కూతురిపై వేసిన నిందకు వారు విలపించారు. బనగానెపల్లె ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్య దోరణి కారణంగా ఓ విద్యార్థిని తాను చేయని తప్పుకు తీవ్ర మనోవేదనను అనుభవించింది. తక్షణం అక్కడి పరీక్షలను నిర్వహించి రిపోర్టు ఇచ్చిన వైద్యులను సస్పెండ్ చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బాలికకు రెండు నెలలు రుతుస్త్రావం కాకపోవడంతో బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించాం. గర్భిణి అని రిపోర్టు రావడంతో అమె తల్లిదండ్రులను పిలిపించి వారి అనుమతితోనే టీసీ ఇచ్చి పంపించామని తమపై ఎలాంటి భారం పడకుండా పాఠశాల ఇన్‌చార్జి ఎస్‌వో సయిదా కలీద్‌ ఫాతిమా వ్యాఖ్యానించడం కూడా బాధితురాలి బంధువులు తప్పుబడుతున్నారు. గర్భణి కాకుండానే ఇలా నింద వేసి పంపడం.. ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. సెకండ్ ఓపీనియన్ తీసుకోకుండానే గుడ్డిగా విద్యార్థినిపై నిందలు వేస్తారా..? అన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. పాఠశాల విద్యార్థినికి ఇది ఎదురైయ్యందని తప్పును తమపై వేసుకోకుండా తీవ్రంగా యత్నిస్తున్న పాఠశాల ఇంచార్జ్.. ఇదే పరిస్థితి తన కూతుళ్లకు వస్తే ఇలానే వ్యవహరించేదా..? అని కూడా బాధితురాలి బందువులు నిలదీస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student  10 class  mensuration  pregnant  teachers  kurnool kusturibha high school  minority student  

Other Articles