Nehru feared more about Netajis borther

Nehru feared about netajis borther

Netaji, Subhash chandra Bose, Netaji files, Netaji News, Netaji Mistory, Sharat chandrabose, Nehru, Nehru on Netaji

Jawahar Lal Nehru afraid of Netajis elder brother Sharat chandrabose. A british officer wrote a letter to british govt that Sharat Chandra Bose is most dangerous.

నెహ్రూ భయపడింది..బోస్ కా? వాళ్ల అన్నకా..?

Posted: 09/25/2015 01:23 PM IST
Nehru feared about netajis borther

నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నేతాజీ గురించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన పలు ఫైళ్లలో కీలక సమాచారం ఉంది. ఎంతో కాలంగా నేతాజీ మరణం మీద భారత సర్కార్ వద్ద ఉన్న సమాచారాన్ని వెల్లడించాలని సుభాష్ చంద్రబోస్ వారసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రకరకాల కారణాలతో బోస్ మిస్టరీ మీద ఎలాంటి ఆధారాలను, ఫైళ్లను బయటపెట్టలేదు. తాజాగా మోదీని కలిసిన బోస వారసులు ప్రభుత్వం నుండి బోస్ వివరాల వెల్లడికి హామీ పొందారు.

అంతకు ముందే సుభాష్ చంద్రబోస్ కు సంబందించిన ఫైళ్లను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టేసింది. మమతా బెనర్జీ బోస్ కు సంబందించిన ఫైళ్లను బహిర్గతం చేసింది. అయితే అందులో నెహ్రూ, నేతాజీకి సంబందించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. అందులో నేతాజీ వాళ్ల అన్న గురించి కూడా సమాచారం ఉండటం విశేషం.

Also Read : నేతాజీ మిస్టరీపై ఆ 64 ఫైళ్లు

Also Read : నేతాజీ సుభాష్ చంద్రబోసే... గుమ్నమి బాబా

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద తర్వాత అతని వారసుల మీద నాటి ప్రధాని నెహ్రూ నిఘా ఉంచారు అన్న విషయం తేలిపోయింది. నెహ్రూ తన రాజకీయ ప్రయోజనాల కోసం అలా చేసి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే నెహ్రూ, నాటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా నేతాజీ కన్నా వాళ్ల అన్నయ్య శరత్ చంద్రబోస్ గురించే ఎక్కువగా భయపడిందట. అప్పటి బ్రిటీష్ అధికారలు రాసిన ఓ లెటర్ ఈ విషయం తెలిసింది. నేతాజీ కన్నా శరత్ చంద్రబోస్ ఎంతో డేంజర్ అని... బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్నకైనా ముప్పు తెస్తాడని ఆ లెటర్ లో ఉంది. అయితే స్వాతంత్రం తర్వాత నెహ్రూ ప్రధాని అయ్యారు. నేతాజీ అన్న శరత్ చంద్రబోస్ ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చాలని అనుకున్నారట. దాంతో నెహ్రూ చంద్రబోస్ కుటుంబం మీద నిఘా ఉంచింది అని అనుకుంటున్నారు. మొత్తానికి నేతాజీకి సంబందించిన ఫైళ్లలో నేతాజీ అన్న శరత్ చంద్రబోస్ గురించి కూడా ఉండటం విశేషమే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles