Sundar Pichai welcomes Modi

Sundar pichai welcomes narendra modi to silicon valley

Google, Modi, Sunder pichai, google, silicon valley, America, Obama, Modi Tour

Sundar Pichai welcomes Narendra Modi to Silicon Valley. "Prime Minister Modi, welcome to Silicon Valley," says Sundar Pichai in a YouTube video ahead of the Indian Prime Minister's visit to the hub of technology. Pichai is the designated CEO of Google. In his video message addressed to Modi, Pichai says that there is "tremendous excitement for your visit amongst all Googlers and the entire Indian community."

ITEMVIDEOS: గూగుల్ సిఈఓ అయ్యారు మోదీకి గులాం

Posted: 09/24/2015 01:53 PM IST
Sundar pichai welcomes narendra modi to silicon valley

అవును, మన మోదీగారి చరిష్మా అన్ని చోట్లా నడుస్తోంది. అమెరికా, ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరిన మోదీకి వెళ్లిన ప్రతీచోటా సాదర స్వాగతం లభిస్తోంది. అమెరికాలోని సిలికన్ వ్యాలీని సందర్శించనున్న మోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలవనున్నారు. ఒబామాతో కొన్ని కీలక అంశాలను చర్చించి రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అయితే అమెరికాలో మోదీగారికి గతంలో అంటే మొదటిసారి అమెరికాకు వెళ్లినప్పుడు అక్కడ మోదీకి వచ్చిన క్రేజ్ ను ఎవరూ మరిచిపోలేదు. అయితే తాజాగా అమెరికా పర్యటన చేస్తున్న భారత ప్రధాని మోదీకి గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చై సాదరంగా స్వాగతం పలికారు. సుందర్ పిచ్చై వీడియో మెసేజ్ ద్వారా మోదీకి స్వాగతం పలికారు. అలాగే భారత్ గురించి కూడా మనవాడు బాగా మాట్లాడాడు.

బారత ప్రధాని మోదీ.. మిమ్మల్ని సిలికాన్ వ్యాలీ పిలుస్తోంది అంటూ మొదలుపెట్టిన సుందర్ పిచ్చై.. మోదీగారి విజనరీ మిషన్ డిజిటల్ ఇండియా గురించి ప్రస్తావించారు. మోదీ దేశంలో ఎంతో మందిని నెట్ ప్రపంచానికి చేరువ చెయ్యాలని చేస్తున్న ప్రయత్నానికి దేశంలోనే కాదు.. విదేశాల నుండి కూడా మంచి సహకారం అందుతోందని పిచ్చై అన్నారు. గూగుల్ కంపెనీ కూడా భారత ప్రజలకు మరింత సేవ చేసేందుకు సిద్దంగా ఉందని.. ఇప్పటికే ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నట్లు వెల్లడించారు. భారత్ లో 1.2 మిలియన్ భారతీయులకు నెట్ ను మరింత చేరువచేసేలా తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే సిలికాన్ వ్యాలీ పర్యటన.. బారతీయులకు మరింత ఉపయోగకరంగా జరగాలని పిచ్చై ఆశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Google  Modi  Sunder pichai  google  silicon valley  America  Obama  Modi Tour  

Other Articles