Kumudam Tamil Magazine Creates Controversy By Posting Article On Women Clothes | Social Media Netigens | Women Controversies

Kumudam tamil magazine controversial comments women clothes social media netigens

kumudam magazine, women leggings, kumudam leggings story, kumudam women clothes, women hot clothes, women leggings story, social media netizens, tamilnadu controversy

Kumudam Tamil Magazine Controversial Comments Women Clothes Social Media Netigens : Kumudam Tamil Magazine Creates Controversy By Posting Article On Women Clothes With Their Hot Photos.

మహిళల బట్టలపై మ్యాగజైన్ దుమారం..

Posted: 09/23/2015 05:48 PM IST
Kumudam tamil magazine controversial comments women clothes social media netigens

పాశ్చాత దేశాల సంప్రదాయాలు భారతదేశంలో విస్తృతంగా అమలులోకి వచ్చేవాయి. వస్త్రధారణ నుంచి లివ్-ఇన్-రిలేషన్ షిప్ దాకా అన్ని అలవాట్లను అలవరచుకున్నారు నేటి యువతీయువకులు. ఇవి వ్యక్తిగతకు సంబంధించిన విషయాలు కాబట్టి.. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవడం లేదు. కానీ.. కొందరు మాత్రం ఇటువంటి వ్యవహారాలపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ సరికొత్త దుమారాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా మహిళల ప్రవర్తన కాలక్రమంలో మరింత వల్గర్ గా తయారవుతోందంటూ ఎంతోమంది ప్రముఖులు, పత్రికలు, మ్యాగజైన్ లు పేర్కొన్నాయి. ఇప్పుడు తాజాగా వారి దారిలోనే మరో మ్యాగజైన్ మహిళల వస్త్రాలపై సంచలన కామెంట్లు చేసి, కొత్త వివాదాన్ని తెరలేపింది. దీంతో సదరు మ్యాగజైన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులో ‘కుముదం’ అనే వారపత్రిక మహిళలు, అమ్మాయిల వస్త్రధారణపై ఓ కొత్త స్టోరీని ప్రచురించింది. ‘నేతి యువత హద్దులు దాటుతున్నారు.. మహిళలు ధరించే లెగ్గింగ్స్ చాలా అసభ్యంగా వున్నాయి’ అంటూ కథనాన్ని ప్రింట్ చేసింది. దాంతోపాటు కొన్ని ఫోటోలను కూడా ఆ పత్రి తన కవర్ పేజీపై ప్రచురించింది. దీంతో దుమారం చెలరేగింది. ఈ కథనాన్ని విమర్శిస్తూ కొంతమంది మహిళలు సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేశారు. ఆడవాళ్లను అవమానిస్తున్న ఈ కథనంపై ‘కుముదం’ పత్రిక యాజమాన్యం తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆడవాళ్ల దుస్తుల గురించి అసభ్యంగా రాసిన సదరు పత్రిక.. తన కవర్ పేజీపై అలాంటి ఫోటోలు ఎందుకు ప్రచురించారంటూ ప్రశ్నించారు. లెగ్గింగ్స్ ధరించిన యువతుల అనుమతి లేకుండా వారి ఫోటోలను ఎందుకు ప్రచురించాలంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసభ్యత అనేది చూసే కళ్లలోనూ, మనసులోనూ వుంటుంది తప్ప.. మహిళల్లో కాదంటూ పోస్ట్ చేవారు. దీనికి నిరసనగా ‘స్కిన్ టైట్’ దుస్తులతో వున్న ఫోటోలను ఆ పత్రికకు పంపాలంటూ ఇంకొందరు సూచించారు. ఇంకా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మహిళా నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. చూస్తుంటే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం వుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. ఈ దుమారంపై సదరు పత్రిక ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumudam magazine  women leggings story  social media netizens  

Other Articles