Two arrested in minor girl gang rape and sale at rajahmundry

minor girl gangraped by boyfriend and friends, minor girl sold to prostitution house at Rajamundry, gang rape, east godavari, andhra pradesh, Rajamundry, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

Two persons nabbed in a 14 years old girl gang raped and sold to prostitution house at Rajamundry in East Godavari district.

మైనర్ బాలికపై ప్రియుడు, మిత్రుల గ్యాంగ్ రేప్.. వ్యభిచార గృహాలకు అమ్మకం

Posted: 09/22/2015 10:03 PM IST
Two arrested in minor girl gang rape and sale at rajahmundry

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను వ్యభిచార గృహానికి విక్రయించిన ఘటన వెలుగుచూసింది. తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 14 ఏళ్ల బాలిక..  తన ప్రియుడి వద్దకు వెళ్లింది. అమెకు మాయమాటలు చెప్పిన ప్రియుడు రహస్యంగా ఓ స్థలంలో వుంచాడు. విషయాన్ని తన మిత్రులకు కూడా తెలియజేయడంతో వారందరూ బాలికను నిర్ఝన ప్రాంతానికి తీసుకువెళ్లి అమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

అంతటితో అగకుండా అమెను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతంలో వున్న వ్యభిచార గృహ నిర్వాహకులకు రోజుల పద్దతిలో విక్రయించాడు. అలా అలా కొన్ని రోజుల్లోనే అమెను పలు వ్యభిచార గృహాలకు తీసుకెళ్లిన ప్రియుడి చేతికి అమె ధనార్జన చేసే యంత్రంగా మారింది. సెప్టెంబర్ 11న ఇంటి నుంచి వెళ్లిన కూతురు తిరిగిరాకపోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలు బేగం, రౌడీ షీటర్‌ హయగ్రీవన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl  boyfriend  gangrape  Rajamundry  East godavari  crime news  

Other Articles