TDP wins 2 seats in port blair local body elections

Port blair local body elections tdp wins 2 seats

port blair local body elections, Tdp wins 2 seats, Telugudesam Party first step as national party, N.chandrababu Naidu, andaman and nicobar islands, manikyala rao, nara lokesh

Telugudesam Party first step to be recognised as national party, wins Two seats in port blair. local body elections

జాతీయపార్టీగా తొలి అడుగువేసిన టీడీపీ... పోర్ట్ బ్లెయర్ ఎన్నికలలో ఉనికి

Posted: 09/22/2015 07:37 PM IST
Port blair local body elections tdp wins 2 seats

తెలుగు దేశం పార్టీ జాతీయ పార్టీగా తొలి అడగు వేసింది. అండమాన్ నికోబర్‌ ద్వీపంలోని పోర్ట్ బ్లెయిర్ నగర పాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు వెలువడిన 12 వార్డుల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ పలు చోట్ల విజయం సాధించింది. పోర్టు బ్లెయిర్ నగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ చేపట్టారు. ఇప్పటి వరకూ పన్నెండు వార్డుల ఫలితాలు వెల్లడికాగా వాటిలో రెండు వార్డుల్లో (5, 6) వార్డుల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1, ఏఐఏడీఎంకే 1, డీఎంకే 1, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించారు. మరో 12 వార్డుల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

టిడిపితో కలిసి బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చని తెలుస్తోంది. ఈ రెండు పార్టీల కూటమికి సాధారణ మెజారిటీ దక్కాలంటే, మరో 5 వార్డుల్లో బీజేపీ లేదా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించాల్సి ఉంటుంది. టిడిపి - బిజెపిలు కలిసి ఇప్పటికే 8 స్థానాల్లో గెలిచాయి. మరో ఐదు స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. పోర్ట్‌బ్లెయిర్‌ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప.. జాతీయపార్టీగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ఇది తొలి విజయమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో టిడిపి బలీయమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందుందని ధీమా వ్యక్తం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : port blair local body elections  Tdp wins 2 seats  TDP as national party  

Other Articles