Akshay Kumar hepls struck farmers

Akshay kumar gives rs 1 lakh monthly to 30 drought struck farmers

Akshay kumar, farmers, Help, Akshay helps to farmers, Suicide, Maharstra

Respect! Akshay Kumar gives Rs 1 lakh monthly to 30 drought struck farmers. Akshay Kumar is undoubtedly the ‘king’ of silver screen but with his recent philanthropist act he proved out to be a real life hero too. In a sheer display of humanity, the action hero has been providing financial aid to the drought struck farmer families of Maharashtra from the past three-four months.

రైతుల పాలిట నిజమైన హీరో అక్షయ్ కుమార్

Posted: 09/22/2015 08:52 AM IST
Akshay kumar gives rs 1 lakh monthly to 30 drought struck farmers

రైతుల ఆత్మహత్యల మీద అందరూ  చలించిపోతున్నారు. మనకు తిండి పెట్టే.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఏమీ చెయ్యలేమా..? దేవుడు మనకు ఎంతో కొంత ఇచ్చాడు.. మన వల్ల రైతులకు ఎంత వరకు చెయ్యగలుగుతామో అంత చేద్దాం అంటూ కొంత మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. మహారాష్ట్రలోని రైతులను నటుడు నానా పాటేకర్ తనవంతు ఆర్థిక సహాయం చేసి.. వారికి దైర్యాన్ని చెప్పారు. అయితే తాజాగా మరో హీరో అసలైన హీరోయిజం వెలుగులోకి వచ్చింది. హిందీ సినిమా ఇండస్ట్రీలో వేగంగా సినిమాలు చేస్తూ... స్పీడ్ రాకెట్ అని పేరుతెచ్చుకున్న అక్షయ్ కుమార్ కూడా తన ఉదారతను ప్రదర్శించారు. తాను చేసిన దాన్ని అందరి ముందు చెప్పకుండా సైలెంట్ గా తన వరకు సేవ చేసేస్తున్నారు.

కరువు కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలోని అన్నదాతలకు అండగా అక్షయ్‌ నిలిచారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డారు. అయితే, మిగతా సెలబ్రెటీల్లా, కొంత మొత్తం చేతిలో పెట్టి ఆయన ఊరుకోవడం లేదు. దానితోపాటు.. నెలవారీగా కూడా బాధిత కుటుంబాలను అక్షయ్‌ ఆదుకొంటున్నారు. కుటుంబానికి  50 వేలు నుంచి లక్ష దాకా..ప్రతి నెలా పంపుతున్నారని అక్షయ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఇలా నాలుగు నెలలుగా పంపిణీ చేస్తున్నారట. దీనికోసం ఆయన ఎన్జీవోలపై ఆధారపడటం లేదు. సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. మహారాష్ట్ర పరిధిలో ఈ బృందం తిరుగుతూ, అత్యవసరంగా సాయం అవసరమైన కుటుంబాలను ఎంపిక చేస్తుంది. ఇలా ఇప్పటిదాకా ముప్ఫై కుటుంబాలను గుర్తించినట్టు, వారందరికీ ప్రతి నెలా అక్షయ్‌ నుంచి సాయం అందుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 180 కుటుంబాలకు సాయం అందించాలని ఆయన ఆలోచన చేస్తున్నారట. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాల కోసం.. తన వైపు నుంచి ఏకమొత్తంగా 90 లక్షలను విరాళంగా అక్షయ్‌ అందించారు.  ఇలాంటి హీరోలు రైతులకు బాసటగా నిలవడం నిజంగా ఆదర్శం. అక్షయ్ కుమార్ ఇలాంటి సేవ కార్యక్రమాలను మరిన్ని చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాం..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Akshay kumar  farmers  Help  Akshay helps to farmers  Suicide  Maharstra  

Other Articles