teacher held for blackmailing and kidnaping tenth class girl student

Teacher abducts tenth class student in hyderabad

teacher harasses girl student, teacher kidnaps girl student, jubilee hills police arrests teacher, nirbhya case on jubilee hills teacher, teacher physical and mental harassment on student, teacher molestation on student, teacher blackmails student, teacher molests tenth student, teacher arrested in hyderabad

A physics teacher had been arrested for molesting, blackmailing and kidnaping tenth class girl student in hyderabad.

విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. కటకటాల్లోకి కీచక గురువు..

Posted: 09/18/2015 09:04 PM IST
Teacher abducts tenth class student in hyderabad

విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచరే.. తన విద్యార్థులపై కామవాంఛతో వ్యవహరించి కటకటాలపాలయ్యాడు. ప్రేమ పేరుతో తన విద్యార్థినిని వేధిస్తూ లైంగిక వాంఛలను తీర్చాలని పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించన కీచకుడికి పోలీసులు అరదండాలు వేశారు. తన వాంఛ తీర్చమని విద్యార్థిని కిడ్నాప్ చేసిన కీచక టీచర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. కార్మిక నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గా,  ఫిజిక్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్నాడు రాము. తనకు వివాహమైందన్న విషయాన్ని కూడా మర్చిపోయి.. అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల ఏడాదిగా కామవాంఛ పెంచుకున్నాడు. ట్యూషన్ పేరుతో ఆ బాలికను తన గదికి రప్పించుకొని తాను ప్రేమిస్తున్నానని తరచూ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. అమెతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సెల్ ఫోన్ లో చిత్రీకరించి భయపెడుతూ ప్రేమించకపోతే చంపేస్తానంటూ హెచ్చరించాడు.

వారం క్రితం గుంటూరు జిల్లా వినుకొండలో రాము భార్య భారతికి ఆసుప్రతిలో సర్జరీకాగా చూడటానికి వెళుతూ విద్యార్థినిని బలవంతంగా తనవెంట తీసుకెళ్లాడు. తాను రానని ఆ బాలిక మొత్తుకున్నా వినకుండా బ్లాక్ మెయిల్ చేసి తీసుకెళ్లాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు అదేరోజు తమ కూతురు కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. టీచర్ రాము ఆ బాలికను గుంటూరు పరిసరప్రాంతాల్లో బంధించి వేధించడం మొదలు పెట్టాడు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలిస్తుండగానే రాము బంధువులు నిఘా వేసి బస్సులో బాలికతో కలిసి తిరుగుతున్న రామును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వినుకొండ పోలీసులకు అప్పగించారు. అప్పటికే బాలిక మిస్సింగ్ కేసు జూబ్లీహిల్స్‌లో నమోదు కావడంతో వినుకొండ పోలీసులు నిందితుడిని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. కిడ్నాప్, నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : physics teacher  harassement  tenth student  kidnap  molest  blackmailing  hyderabad  

Other Articles