obscene dances by recording dance troop at hyderabad

Recording dance in private party at banjara hills

Recording Dance in Private Party at Banjara Hills || Hyderabad, Recording Dance in Private Party at Banjara Hills, Recording Dance in Private Party, Recording dance at hyderabad, obscene dances at saidappa colony, obscene dances by recording dance troop at hyderabad

obscene dances conducted by Recording Dance troop in Private Party at hyderabad, where the venue is very near to Banjara Hillspolice station

ITEMVIDEOS: అవ్వ.. అక్కడ కూడా అశ్లీల నృత్యాలు..

Posted: 09/18/2015 07:22 PM IST
Recording dance in private party at banjara hills


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో పాశ్చ్యాత సంస్కృతి జడలు విప్పింది. సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మధ్య నిషేధాన్ని ఎత్తివేసిన కొత్తలో పలు బార్లలో అసభ్య నృత్యాలు.. రికార్డింగ్‌ డ్యాన్సులు వినిపించాయి. దీనిపై విమర్శలు తలెత్తడంతో అప్పట్లోనే ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఆ తరువాత కొన్నాళ్ల పాటు అడపా, దడపా అక్కడక్కడ వినబడిన రికార్డిండ్ డాస్సుల మోత పూర్తిగా సద్దుమణిగిన సమయంలో ఇన్నాళ్లకు మళ్లీ వినిపించాయి. బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ అశ్లీల నృత్యాలు జరగడం చర్చనీయాంశంగా మారాయి.


బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని సైదప్ప కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద రికార్డింగ్ డాన్సులు ట్రూపు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో నిర్వాహకులు  ఈ రికార్డింగ్‌ డాన్సులను ఏర్పాటు చేశారు. మొదట ఆర్కెస్ట్రాతో మొదలు పెట్టి...ఆ తర్వాత అసభ్యకర నృత్యాలకు తెర తీశారు. పెద్ద సౌండ్‌సిస్టమ్‌ల మధ్య బహిరంగంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా.... పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎక్కడో గుంటూరు, ఆయా పరిసర ప్రాంతాల్లో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే అశ్లీల నృత్యాల సంస్కృతికి నగరానికి కూడా వ్యాపించడంపై పెద్ద స్థాయిలో విమర్శలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : obscene dances  recording dance  banjara hills  private party  hyderabad  

Other Articles