I am Narendra Modi's daughter

I am narendra modi s daughter

Avani Modi, Gujarati model,Narendra Modi's daughter, Gujarat, Modi, Calender Girls

I am Narendra Modi's daughter Madhur Bhandarkar's upcoming movie 'Calendar Girls' is hogging all the limelight right before it's release. Gujarati model, Avani Modi who will be seen sizzling on the silver screens in the movie claims that she is the daughter of Narendra Modi, according to a report in Navbharat Times.

నరేంద్ర మోదీ కూతురు పేరు తెలుసా..?

Posted: 09/16/2015 09:46 AM IST
I am narendra modi s daughter

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో బ్యాచిలర్ పొలిటికల్ లీడర్లలో బాగా ఫేమస్. మోదీకి పెళ్లి జరిగింది అని కొంత మంది వాదిస్తున్నా దాన్ని చాలా మంది నమ్మడం లేదు. సరే పెళ్లి గొడవ ఎలా ఉన్న తాజాగా నరేంద్ర మోదీకి ఓ కూతురు ఉంది. అవును నరేంద్ర మోదీనే నా తండ్రి అంటూ ఓ మోడలింగ్ చేస్తున్న అమ్మాయి మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. కొంపదీసి నరేంద్ర మోదీ అబద్దం చెబుతున్నారా..? అనే అనుమానాలు కొంత మంది వ్యక్తం చేస్తుంటే కొంత మంది మాత్రం అవునా..? సరే అంటూ తీరిగ్గా వింటున్నారు. మొత్తానికి అటు రాజకీయరంగంలో, సినిమా రంగంలో మోదీ కూతురు వార్త హల్ చల్ చేస్తోంది. అసలు ఆ కూతురు ఎవరు..? మోదీ గారి నిజమైన కూతురేనా.? తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే.

ఫ్యాషన్ సినిమాతో మోడల్ వృత్తిలో ఎన్ని ఎత్తుపళ్లాలుంటాయో... చూశాం.. కాగా ఇప్పుడు క్యాలెండర్ గర్ల్స్ సినిమాలో మోడలింగ్, సినీ రంగాల్లో ఉన్న అమ్మాయిలు కష్టాలు ఎదుర్కొంటున్నారు అనే అంశంతో... రూపొందింది. ఈ సినిమాలో మోడల్ అవానీ మోడీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమె పేరులో మోడీ ఉండడమే కాదు... ఆమెది గుజరాత్ కావడంతో... అందరూ ఆమెను ప్రధాన మంత్రి మీకేమవుతారు? బంధువా...? అని చాలా మంది ప్రశ్నిస్తూంటారట. అలాంటి ప్రశ్న ఎదురయ్యే సందర్భంలో ఠక్కున నేను అవును నేను మోడీ కూతుర్ని.. అని చెబుతాను అని తెలిపింది. కేవలం గుజరాతీ అమ్మాయిలే కాదు.. దేశానికి మోడీ ప్రధాని కనుక దేశంలోని అమ్మాయిలంతా... మోడీ కూతుర్లే అని వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avani Modi  Gujarati model  Narendra Modi's daughter  Gujarat  Modi  Calender Girls  

Other Articles