Jagan Mohan Reddy media house over ecposing

Jagan mohan reddy media house over ecposing

Jagan, Sakshi, Jagan Mohan Reddy, Sakshi tv, Hero, Jagan as hero

Jagan Mohan Reddy media house over ecposing. Sakshi media channel exposing Jagan as the Hero, But he dont have the qualities.

ITEMVIDEOS: జగన్ హీరో అట.. ఆ చానల్ ఓవర్ యాక్షన్

Posted: 09/15/2015 01:21 PM IST
Jagan mohan reddy media house over ecposing

మాట్లాడటానికి ఓ మైక్.. చూపించడానికి ఓ ఛానల్ ఉంటే చాలు ఇండియాలో ఏమైనా చూపించొచ్చు. అందునా అన్ని మీడియా హౌజ్ ల కన్నా తెలుగు మీడియా హౌజ్ లకు ఈ అలవాటు చాలా ఎక్కువ. ఎల్లో జర్నలిజం అన్న మాట కూడా తెలియన చాలా మంది జర్నలిస్ట్ లు తమ మీడియా హౌజ్ ల ద్వారా తమకు కావాల్సిన వాళ్ల గురించి కావాల్సినంత ప్రచారం చెయ్యడం ఎప్పటి నుండో ఉన్న అలవాటు. అయితే కాలాన్ని ఎలా అయితే క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అని విభజిస్తారో తెలుగునాట సాక్షి మీడియా తర్వాత తెలుగు మీడియా నడవడిక, సాక్షి తర్వాత మీడియా నడవడిక అని విభజించాల్సి వస్తుందేమో. ఎందుకు అలా అంటే ఎక్కడైనా మీడియాలో ఏదో ఒక పార్టీకి కాస్త ఫేవర్ గా మాట్లాడటం మామూలే. కానీ జగన్ మీడియాలో వచ్చేదంతా ఒకటే న్యూస్ అదే జగన్.

తిరుపతిలో యుదభేరి పేరుతో జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సభ భారీగానే జరిగింది. విద్యార్థులు, జగన్ మద్దతుదారులు చాలా మంది ఇందులో పాల్గొన్నారు. జగన్ కు చాలా మంది మద్దతునిస్తూ.. అక్కడికి వచ్చిన చాలా మంది జగన్ అభిమానులు సభలో నినాదాలు చేశారు. సరే జగన్ అభిమానులు కాబట్టి అలా చేస్తుంటారు కానీ జగన్ ను ఏకంగా హీరో హీరో అంటూ సాక్షి ఛానల్ లో చూపించిన విధంగా ఎందుకో ఛండాలంగా అనిపించింది. అయినా హీరో కావాలంటే సభలు నిర్వహించాలా.? అయినా జగన్ ను హీరో ఎందుకు అనాలి..?

* రైతుల కోసం పోరాటం చేస్తున్నారా..?
* ఇప్పటి దాకా జగన్  ఏం చేశారో..?
* ప్రత్యేక హోదా మీద పార్లమెంట్ లో విభజన సమయంలో ఎందుకు మాట్లాడలేదు..?
* కనీసం పవన్ కళ్యాణ్ లా సహేతుకంగా కూడా కారణాలను వివరించలేకపోతున్నారు ఎందుకు..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : Jagan  Sakshi  Jagan Mohan Reddy  Sakshi tv  Hero  Jagan as hero  

Other Articles