India-China troops face-off near Line of Actual Control in Ladakh

India china troops face off near lac in ladakh

india-china face-off in ladakh, India-China troops face-off near Line of Actual Control, china temporary hut in Burtse, china hut demolished by indian Army, India-China clash, Ladakh, PLA, Chinese army, Daulat Beg Oldi, rajnath singh manoar parikar talks, union home minisster Rajnath, indain defence minister manohar parikkar

the Chinese troops had built a temporary hut in Burtse, North of Ladakh, which was subsequently demolished by the ITBP and Army jawans

సరిహద్దులో డ్రాగన్ అధిపత్యంపై ధీటుగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీ

Posted: 09/13/2015 03:51 PM IST
India china troops face off near lac in ladakh

భారత నియంత్రణ రేఖ వద్ద గత కొన్ని రోజులుగా డ్రాగన్ దేశం చెల్లాయిస్తున్న అధిపత్యానికి భారత్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. సరిహద్దు నియమనిబంధనలకు కట్టుబడి వుండాలని తేల్చిచెప్పింది. అంతేకాదు. ఇకపై తమ భూభాగంలోకి చోచ్చుకువవచ్చేందుకు ఎలాంటి చర్యలను చేసినా ప్రతిఘటన తప్పదని స్పష్టం చేసింది. ఇరు దేశాల సరిహద్దుల మధ్య ఉన్న పెట్రోలింగ్ లైన్‌పై టవర్ నిర్మించేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యత్నించినప్పుడు ఇండియన్ ఆర్మీ అడ్డుకుంది. అయినా కూడా లెక్క చేయకుండా చైనా ఆర్మీ నిఘా టవర్‌ను ఏర్పాటు చేసింది. డ్రాగన్ ఆర్మీకి తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియన్ ఆర్మీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులతో కలిసి వెళ్లి చైనా ఏర్పాటు చేసిన టవర్‌ను కూల్చేసింది.

వాస్తవానికి పెట్రోలింగ్ లైన్‌పై రెండు దేశాలూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. దానిని అతిక్రమించిన చైనా ఆర్మీ నిబంధనలు పాటించకుండా భారత్‌ను ఇరుకున పెట్టేందుకు టవర్ నిర్మించింది. ఆ టవర్‌ను కూల్చి తాము బెదిరిపోబోమంటూ ఇండియన్ ఆర్మీ గట్టి సమాధానమిచ్చింది. దీంతో ఒక్కసారిగా నియంత్రణ రేఖ వద్ద చైనా అదనపు బలగాలను రప్పించింది. భారత్‌ కూడా సైన్యాన్ని తరలించింది. రెండు దేశాల బలగాలు ముఖాముఖి ఎదురుపడటంతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. లడఖ్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా బలగాలు ఎదురెదురుపడి ఉద్రిక్తత తలెత్తిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌తో సమావేశమయ్యారు. చైనా దాదాగిరిపై చర్చించారు. తాజా పరిస్థితిపై రాజ్‌నాథ్ పారికర్‌తో చర్చించారు. చైనా ప్రతిస్పందనను బట్టి చర్యలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India-China clash  Ladakh  PLA  Chinese army  Daulat Beg Oldi  

Other Articles