Allegations mount against Minister Peethala Sujatha.

Allegations arise again against minister peethala sujatha

allegations arise again against minister peethala sujatha, peethala sujatha, gift, secret, andhra pradesh, necklaces, pattu sarees, allegations on minister peethala sujatha, minister sujatha accepted bribe, officials gave bribe to minister sujatha, saree and necklace given to minister sujatha, minister sujatha review meet

allegations arise again against minister peethala sujatha that she had accepted bribe given by officials in the form of saree and golden necklace before review meet.

పట్టుచీర, పుత్తడి గోలుసు.. రహస్యం అమాత్యులకే తెలుసు..

Posted: 09/10/2015 07:48 PM IST
Allegations arise again against minister peethala sujatha

ఏపీ కేబినెట్‌లో మహిళా మంత్రిగా ఉన్న పీతల సుజాత మరోసారి వివాదంలో పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెను వారించి ఇంకా ఏడాది కూడా గడవకముందే అమె మరోమారు తన తప్పును పునరావృతం చేశారు. కర్నూలు లో ఆమె మహిళా,స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్షించేందుకు ముందు అమెను ఆ జిల్లాకు చెందిన అధికారులు ప్రసన్నం చేసుకున్నారు. తమ తప్పులేమైనా వుంటే ఖాయమని చెబుతూ.. అమాత్యుల వారికి విలువైన పుత్తడి నెక్లస్, పట్టుచీరను బహుమతిగా ఇచ్చారు. అయితే అధికారులు నుంచి కాని, ఉద్యోగుల నుంచి కానీ, కాంట్రాక్టర్ల నుంచి కానీ లేక ఇతర వ్యక్తుల నుంచి కానుకల రూపంలో లభించే ఏ వస్తువును స్వీకరించవద్దని, అది తన మంత్రి పదవికే అపకీర్తి తీసుకువస్తుందని తెలసికూడా అమాత్యుల వారు వాటిని రహస్యంగా స్వీకరించారు.

పద్దెనిమిది మంది సిపిడిఓలు ఐదేసి వేల రూపాయల చొప్పున పోగుచేసుకుని తొంభై వేలతో నెక్లస్, పట్టుచీర ఇచ్చారని ప్రచారం జరుగుతున్నా.. వాటి విలువ అంతకన్నా అధికంగానే వుంటుందని తెలుస్తుంది. సీపీడిఓలు ఏదో చూచాయగా తెలిసిన మీడియా ఎదుట అదెంత.. రెండూ కలపి తొంబై వేలాగా అంటూ తమ వస్తువలును తక్కువ చేసే ప్రయత్నం చేశారని, కానీ ఆ కానుకలు విలువ మరింత అధికంగానే వుంటుందని సమాచారం. అయితే ఇలాంటి కానుకలు గ్రటా తీసుకోవద్దని ఇప్పటికే మంత్రివర్యులకు సాక్షాత్తు చంద్రబాబు తేల్చిచెప్పారు.

ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు గత ఏడాది అక్టోబర్ మాసంలో సన్మానం చేశారు. అయితే ఈ సన్మానంలో ఆమెకు రూ.40 లక్షల విలువ చేసే వడ్డాణం కూడా బహూకరించారన్న వార్తలు బయటకు వచ్చాయి. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి సిద్దా రాఘవరావు సోదరుడు అధ్యక్షతనే గ్రానైట్ వ్యాపారులు మంత్రిగారిని ప్రసన్నం చేసుకుని తమ వ్యాపారాలు సజావుగా, సక్రమంగా, ఎలాంటి అవంతరాలు లేకుండా సాగేలా చూడాలని కోరుకుంటూ ఈ చిరు కానుక సమర్పించుకున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆమెపై అగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా చెప్పి ఇంకా సంవత్సరం కూడా తిరగనలేదు. అప్పుడే మంత్రివర్యులు అధికారుల నుంచి బహుమతులు లాగేస్తున్నారన్న వార్త సంచలనంగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : peethala sujatha  gift  secret  andhra pradesh  necklaces  pattu saree  

Other Articles