Bihar Assembly election to be held in 5 phases,results on November 8

Election commission announces bihar poll dates highlights

bihar, bihar assembly elections 2015, Bihar assembly elections date, Bihar assembly polls date, Chief Election Commissioner Nasim Zaidi, Bihar pollsBihar polls 2015Bihar assemblyBihar Assembly Polls 2015Battle for BiharElection CommisionBihar poll dates

The Election Commission on Wednesday announced the dates for the high-stakes Assembly elections in Bihar.

బీహర్ ఎన్నికలకు మ్రోగిన నగరా.. షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ

Posted: 09/09/2015 02:03 PM IST
Election commission announces bihar poll dates highlights

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మ్రెగింది. బీహార్ రాష్ట్రంలో అక్టోబర్ 12 నుంచి ఐదు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ నసీం జైదీ బీహార్ రాష్ట్ర ఎన్నికల వివరాలను వెల్లడించారు. బీహార్ లోని మొత్తం 243 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలలో ఆరు కోట్ల అరవై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సెప్టెంబర్ 6న తొలి విడత ఎన్నికలకు నోటిషికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 12న తొలి విడత ఎన్నికలలో భాగంగా 49నియోజకవర్గాలు, , అక్టోబర్ 16న రెండో విడత ఎన్నికలలో భాగంగా 32 నియోజకవర్గాలు, అక్టోబర్ 28న మూడో విడత ఎన్నికలలో భాగంగా 50 నియోజకవర్గాలు, నవంబర్ 1న నాలుగో విడత ఎన్నికలలో భాగంగా 55 నియోజకవర్గాలు, నవంబర్ 5న తుది విడత ఎన్నికలలో భాగంగా 57 నియోజకవర్గాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఎన్నికలు కౌంటిగ్ నవంబర్ 8న నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లో సుమారు 29 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా అంచనా వేసిన ఎన్నికల సంఘం, 47 అసెంబ్లీ నియోజకవర్గాలను అత్యంత ప్రభావిత ప్రాంతంగా పరిగణించింది. ఈ సారి ఎన్నికలలో ఈవీఎంలలో ఓటరు ఫోటో ఐడీ కార్డులు కూడా నిక్షిప్తమయ్యి వున్నాయని దీంతోదొంగ ఓట్లను అరికట్టనున్నారు. తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పారు.

తొలి విడత ఎన్నికలకు

* నోటిఫికేషన్ తేదీ: సెప్టెంబర్ 16 (బుధవారం).
* నోటిఫికేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 21 (బుధవారం).
* పరిశీలనకు తేదీ: సెప్టెంబర్ 24.
* ఉపసంహరణ చివరి తేదీ: సెప్టెంబర్ 26.
* అక్టోబర్ 12, 2015న పోలింగ్ తేదీ.
* తొలిదశలో 49 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

రెండో విడత ఎన్నికలకు

* నోటిఫికేషన్ తేదీ: సెప్టెంబర్ 2 (సోమవారం).
* నోటిఫికేషన్ చివరి తేదీ: సెప్టెంబర్ 28 (సోమవారం).
* పరిశీలనకు తేదీ: సెప్టెంబర్ 29.
* ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 1.
* అక్టోబర్ 16, 2015న పోలింగ్ తేదీ.
* రెండోదశలో కైముర్, అర్వై, బహానబాద్, ఔరంగాబాద్, గయా సహా 32 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

మూడో విడత ఎన్నికలకు

* నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 8
* నోటిఫికేషన్ చివరి తేదీ: అక్టోబర్ 15 (బుధవారం).
* పరిశీలనకు తేదీ: అక్టోబర్ 17
* ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 19.
* అక్టోబర్ 28, 2015న పోలింగ్ తేదీ.
* మూడోదశలో సారన్, వైశాలి, నలంగా, పాట్నా, బోజ్ పూర్, బుక్సర్ సహా 50 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

నాలుగో విడత ఎన్నికలకు

* నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 14
* నోటిఫికేషన్ చివరి తేదీ: అక్టోబర్ 21 (బుధవారం).
* పరిశీలనకు తేదీ: అక్టోబర్ 22
* ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 23.
* నవంబర్ 1, 2015న పోలింగ్ తేదీ.
* నాలుగోదశలో పశ్చిమ్ చంపరన్, పూర్వీ చంపరన్,షియోహర్, సితామార్హి, ముజాఫర్పూర్, గోపాల్ గంజ్, సివాన్ సహా 55 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

తుది విడత ఎన్నికలకు

* నోటిఫికేషన్ తేదీ: అక్టోబర్ 19
* నోటిఫికేషన్ చివరి తేదీ: అక్టోబర్ 25 (బుధవారం).
* పరిశీలనకు తేదీ: అక్టోబర్ 26
* ఉపసంహరణ చివరి తేదీ: అక్టోబర్ 27.
* నవంబర్ 5, 2015న పోలింగ్ తేదీ.
* తుదిదశలో మదుబపి. సుపౌల్, అరార్య, కిషన్ జంగ్, పుర్ణియా, కటిహార్, మాదేపురా, సహస్రా దుర్బాంగ సహా 57 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles