Hungarian journalist who kicked running refugees fired

Hungarian journalist kicked running refugees

N1TV, Laszlo Petra Shame Wall, Laszlo Petra , Hungary, Social Media, Refugees

The camerawoman from Hungary who faced the ire of social media on Tuesday for kicking and tripping refugees including children has been fired from her job. The incident came in notice after a video footage was released where the Hungarian camerawoman was seen intentionally kicking refugees, including a girl and then tripping a man holding a child in his arm who was running from the border police.

ITEMVIDEOS: ఆ జర్నలిస్ట్ మీద తిట్ల వర్షం కురిపిస్తున్న జనం

Posted: 09/09/2015 01:52 PM IST
Hungarian journalist kicked running refugees

మీడియాలో పని చేసే వాళ్ల గురించి అందరికి తెలుసు.. లోకం ఎటు పోతోంది అంటూ నిలదీసే మీడియా ప్రతినిధులు అసలు తాము ఎటు పోతున్నామో అన్నదాని మీద మాత్రం క్లారిటీ ఉండదు. అయితే అందరూ అలానే ఉంటారు అని చెప్పలేము కానీ కొందరు మాత్రం ఖచ్చితంగా అలానే ఉంటారు అన్నది మాత్రం వాస్తవం. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే ఓ జర్నలిస్ట్ మీద జనాలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి పోస్తున్నారు. ఆమె చేసిన ఓ ఘన కార్యానికి సోషల్ మీడియాలో జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మడు ఏం చేసింది.. ఎందుకు అంతలా జనాలు ఆమె మీద విరుచుకుపడుతున్నారు ..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో బలైపోతున్న ఎంతో మంది అమాయకులు మధ్యలోనే జీవితాలను ముగించేస్తున్నారు. దాంతో గత కొంత కాలంగా ఉగ్రవాదులు, స్థానిక ముఠాలకు దూరంగా దేశం కానీ దేశానికి ఎంతో మంది ప్రయాణమవుతున్నారు. అలా పొట్టచేతపట్టుకొని పరాయి దేశానికి వలస వెళుతున్న క్రమంలో చనిపోయిన ఓ చిన్నారి మరణించడం.. ఆ ఫోటో ఎంతో మందిని కలవరపెట్టింది. అయితే దీని మీద అందరూ స్పందించారు. శరణార్థులను తమ దేశంలోకి  అనుమతిస్తూ చాలా దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే అలా తమ దేశంలోకి వస్తున్న శరణార్థున్ని అడ్డుకోవడం అందరి చేత విమర్శలు గుప్పిస్తోంది.

సెర్బియా- హంగరీ సరిహద్దులోని రోజ్కే గ్రామానికి. మధ్యదరా సముద్రాన్ని దాటి సెర్బియా గుండా హంగరీలోకి సిరియా శరణార్థులు ప్రవేశిస్తున్నారు. అయితే అక్కడ శరణార్థుల కోసం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో శరణార్థులు పరుగుపెట్టారు. వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అలా పరుగెడుతూ తన దగ్గర్నుంచి వెళుతున్న వారికి కాళ్లు అడ్డంపెట్టి పడేసింది ఓ వీడియో జర్నలిస్ట్. అక్కడ వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి వెల్లడించాల్సిన ఓ జర్నలిస్ట్ ఇలా చెయ్యడం ఏంటీ అని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పెట్రా లాజ్లో.. అనే ఆమె ఎన్1 టీవీ అనే ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తోంది.  సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, వత్తిళ్లలో ఆ ఛానల్ అమ్మగారిని ఇంటికి సాగనంపింది. అరగని తేన్పులకు.. ఆకలి కేకలకు తేడా తెలియని వాళ్లు ఎన్నటికీ మనుషులు కాలేదు.. జర్నలిస్ట్ లు అంతకన్నా కాలేరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : N1TV  Laszlo Petra Shame Wall  Laszlo Petra  Hungary  Social Media  Refugees  

Other Articles