Kaloji bday as Telangana language day

Kaloji narayana raos birthday on september 9 as telangana language day

Kaloji, Kaloji Kavithalu, Telangana, Poet, Naa Godava, Telangana language day

The TRS government has decided to observe poet Kaloji Narayana Rao's birthday on September 9 as Telangana language day. Chairing a review meeting on Sunday, chief minister K Chandrasekhar Rao instructed the officials to organize cultural programmes across the state on the occasion of Telangana language day. Schools and collage will hold programmes including debate, essay competition, and speech competition.

ITEMVIDEOS; కాళాతీతం మన కాళోజీ

Posted: 09/09/2015 10:38 AM IST
Kaloji narayana raos birthday on september 9 as telangana language day

‘పుటక చావులు మాత్రమే తనవి - బతుకంతా దేశానిది’గా బతికిన పద్మవిభూషణుడు కాళోజీ నారాయణరావు. తెలంగాణ విమోచనోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, జైలు శిక్షను అనుభవించి రాటుదేలిన ప్రజాకవి. గార్లపాటి రాఘవరెడ్డిగారి సాహచర్యం కాళోజీ కవితారచనకు తోడ్పడింది. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఇతని కవిత్వానికి పదును తెచ్చింది. తెలంగాణ ప్రజాకవి కాళోజీ పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్లా కాళోజీ జన్మ దినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా వేడుక చెయ్యడానికి అన్ని ఏర్పాట్లను చేసింది.

1939వ సంవత్సరం - పెల్లుబుకుతున్న ప్రజా వెల్లువను ఏదో ఒక మేరకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో నిజాం నిరంకుశ ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఉర్దూలో ఈ ప్రక్రియను ‘ఇస్లహాత్‌’ అంటారు. దీని ప్రకారం హైదరాబాద్‌ సంస్థానంలో వృత్తుల ప్రాతిపదికన ఎన్నికలు జరిపి, మంత్రి వర్గాన్ని ఏర్పరచడం జరుగుతుంది. అయితే ఈ మంత్రి వర్గం అసెంబ్లీకి బాధ్యత వహించదు. దాని ఏర్పాటు మొత్తం నిజాం నవాబు ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సంస్కరణలను స్టేట్‌ కాంగ్రెస్‌ బహిష్కరించింది. ప్రజాపక్షపాతియైన కాళోజీ ఈ ఇస్లహాత్‌ను వ్యతిరేకిస్తూ ...

READ ALSO : కవిత్వాలతో తెలంగాణను నిద్రలేపిన కాళోజి!

కవిత్వాలతో తెలంగాణను నిద్రలేపిన కాళోజి!

 

‘‘ఎందులకు? ఎందులకు? - ఇస్లహాత్‌ ఎందులకు?
అయ్యలు మెచ్చని మియ్యలు వొల్లని - ఇస్లహాత్‌ ఎందులకు?
...‘కాదు’ అనుచు చాటుగాను - కన్నుగీటుటెందులకు?
పలుకు పలుకునకు అనుజ్ఞ అయితే - ప్రతినిధులగుట ఎందులకు?
ఆధిపత్యమియ్యలేని - ఆయీన్‌ అది ఎందులకు?’’

అంటూ కేవలం అలంకార ప్రాయమైన మంత్రివర్గ ప్రాతినిధ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంగిలి విస్తరికన్నా హేయమైన పదవులను పొందినవారిని మందలించారు. మరోవైపు నిజాం నవాబు మంత్రివర్గంలో చేరవలసిందిగా ఆహ్వానం రాగా, తిరస్కరించి స్వాభిమానాన్ని ప్రకటించిన బూర్గుల రామకృష్ణారావు గారిని అభినందిస్తూ ...
 
‘‘రాజరికము మోజులేక - తేజరిల్లు నాయకుడా!...
కాలదన్నుమనుటె కాదు - కాలదన్న గల్గినావు’’

అంటూ తెలుగువారు తలెత్తి తిరుగునట్లు చేసిన త్యాగశీలతను ప్రశంసించారు. 1943 మే 26 నాడు హైదరాబాద్‌ ఆబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో జరిగిన దశమాంధ్ర మహాసభ సమావేశంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపనోత్సవ సందర్భంగా ...‘‘మాతృదేశము మాటముచ్చట - ముదముగూర్పదు మదికిననియెడి.../ అగ్గి కొండల అవనియైనను - మాతృదేశము మాతృదేశమే’’ అంటూ మాతృదేశ భక్తి ప్రబోధాత్మకమైన గేయాన్ని రచించారు. మాతృదేశాన్నీ, మాతృభాషనూ అమితంగా అభిమానించిన కాళోజీ, నిజాం రాష్ట్రంలోని తెలుగు ప్రజల్లో కొందరు తెలుగు భాష పట్ల చూపే నిరాదరణకు స్పందించి ...
 
‘‘ఏ భాషరా నీది ఏమి వేషమురా -
...అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు -
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!!’’
అని సూటిగానే హెచ్చరించారు.

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?

దోపిడి చేసే ప్రాంతేతరులను…
దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం – ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది – తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే – మునుగును తప్పక

**Abhinavachary**

(source: Andhrajyothy)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kaloji  Kaloji Kavithalu  Telangana  Poet  Naa Godava  Telangana language day  

Other Articles