wife set herself ablaze in front of immovable husband

Vexed with routine problems wife immolated herself

vexed with routine problems wife immolated herself, wife set herself ablaze in front of immovable husband, hyderabad crime news, crime in ramnagar, dialysis, vinod, srilakshmi, Rajamundry, violence against women, crime against women, attrocity at women, harrassment on women

wife who was vexed up with her problems immolated herself infrontof immovable husband in hyderabad

విధి వంచన.. పతి జీవశ్చవం.. సతి సజీవదహనం.. అనాధలుగా మారిన పిల్లలు

Posted: 09/08/2015 05:57 PM IST
Vexed with routine problems wife immolated herself

ఆ కుటుంబాన్ని విధి వంచిందింది. గోరుజుట్టిపై రోకటిపోటు అన్నట్లు ఇప్పటికే పుట్టెడు కష్టంలో వున్న ఆ కుటుంబికుల మీద మరింత పగబట్టిన విధి.. వారిని చిన్నాభిన్నాం చేసింది. చిధ్రంమైన బతుకులను ఈడ్చలేక ఓ సతి తన పతి సమక్షంలోనే సజీవ దహనం అయ్యింది. కిడ్నీ వ్యాధితో మంచం పట్టిన భర్త.. బడికెళ్తున్న ఇద్దరు పిల్లలు.. ముగ్గురికీ ఆమే ఆధారం! వంట మనిషిగా పని చేస్తే వచ్చే ఆదాయం ఇల్లు నడపడానికి, భర్త వైద్యానికి, పిల్లల చదువుకు.. దేనికీ సరిపోకపోవడంతో మనోవేదన చెందింది. దుర్భర జీవనం గడపలేక బలవంతంగా ఉసురు తీసుకుంది.

 హైదరాబాద్‌లోని రాంనగర్‌లో వెలుగుచూసిన ఘోర విషాదమిది. బడి నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి తీసుకొచ్చిన తనకు పళ్లెంలో అన్నం పెట్టిన తల్లి... కొద్ది క్షణాలకే కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని నిలువునా తగలబడిపోతుంటే నిశ్చేష్టురాలై చూస్తుండిపోయిందా చిన్నారి. కట్టుకున్న భార్య కళ్లముందే కాలిపోతుంటే కనీసం లేచి కాపాడలేని తన దుస్థితి తలచుకుని కుమిలిపోయాడా భర్త. వివరాల్లోకి వెళ్తే.. రాంనగర్‌ వాసి వినోద్‌తో రాజమండ్రి వాస్తవ్యురాలు శ్రీలక్ష్మికి 2004 మే 9న వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సుశీల్‌ సూర్యం (9), సాయి నిఖిత (7).

వినోద్‌కు పుట్టుకతో ఒక కిడ్నీ మాత్రమే ఉంది. అతను ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఏడాది క్రితం అతడి కిడ్నీ చెడిపోయి కాళ్లూచేతులు పడిపోవడంతో మంచంపట్టాడు. దీంతో కుటుంబ పోషణ భారం శ్రీలక్ష్మిపై పడింది. భర్తకు వైద్యం చేయించుకోవడం, పిల్లలను పోషించుకోవడం కోసం ఆమె ఓ ఇంట్లో వంటమనిషిగా చేరింది. వచ్చేడబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం.. కుమారుడు సుశీల్‌ సూర్యంను కీసర సమీపంలోని చీకటి మామిడి వేదపాఠశాల హాస్టల్‌లో చేర్పించింది.

కానీ.. భర్తను 15 రోజులకోసారి డయాలసిస్‌ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించుకోవడం, పాప స్కూలు ఫీజులు, ఇంటి అద్దె చెల్లించడం.. ఇన్ని భారాలను ఆమె మోయలేకపోయింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన శ్రీలక్ష్మి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఒళ్లంతా మంటలు చుట్టుముట్టగా బాధతో కేకలు పెడుతూ చనిపోయింది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinod  srilakshmi  Rajamundry  hyderabad crime news  crime in ramnagar  

Other Articles