Telangana ACB | check posts | Ride

Telanagana acb officials ride on check posts

ACB, Telangana, Check posts, Nizamabad, Kodada, salabathpur check post

Telanagana ACB officials ride on check posts. ACB officlas handover money at the check posts. ACB officlas in 8 teams ride on 15 ckeck posts.

అవినీతి చెక్ పోస్టులు.. తెలంగాణలో ఏసీబీ సోదాలు

Posted: 09/08/2015 04:02 PM IST
Telanagana acb officials ride on check posts

తెలంగాణ రాష్ట్రంలోని చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు కొరడా ఝళిపించారు. ఏకకాలంలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం 8 బృందాలు చెక్ పోస్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. చెక్ పోస్టుల్లో అక్రమవసూళ్లపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 15 చెక్ పోస్టులున్నాయి. ఏపీ, ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర బోర్డర్ లతో కలుపుకుని చెక్ పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లోని ఆలంపూర్ చెక్ పోస్టు, నల్గొండ, ఖమ్మం లోని ఆశ్వారావుపేట,కల్లూరు, ఆదిలాబాద్, ఆదిలాబాద్ లోని వాంకిడి, నిజామాబాద్ లోని మద్నూర్, మెదక్ లోని జహీరాబాద్ చెక్ పోస్టులో సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డుల్లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ క్యాష్ అధికారులకు లభించింది.

ముఖ్యంగా లారీ డ్రైవర్ల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారనే సమాచారంతో అవినీతి నిరోధక అధికారులు విస్తృత దాడులు చేపట్టారు. నల్గొండ జిల్లాలోని.. కోదాడ ఆర్టీఏ చెక్ పోస్ట్ లో సోదాలు నిర్వహించారు. 21 వేల 500 రూపాయల అవినీతి సొమ్ము గుర్తించారు. నిజామాబాద్ లో సలబత్ పూర్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేసిన అవినితి నిరోధక శాఖ.. 44వేల రూపాయలు స్వాధీనం చేసుకుంది. నల్గొండ జిల్లా కోదాడలోనూ 17వేలను పట్టుకున్నారు అధికారులు. మెదక్ జిల్లా జహీరాబాద్ చెక్ పోస్టుపైనా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారున్న అనుమానంతో ఏసీబీ అధికారులు చెక్ పోస్టులో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీలోనూ పలు చెక్ పోస్ట్ లపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో.. వేలల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు చెక్ పోస్ట్ లో 45వేలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ, నలుగురు సిబ్బందిని విచారిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB  Telangana  Check posts  Nizamabad  Kodada  salabathpur check post  

Other Articles