Island for Refugees | Greek | Naguib Sawiris

Egyptian billionaire urging greek and italian leaders to sell him island for refugees

Syrians, Migrants, Refugees, Egyptian Billionaire, Naguib Sawiris, Greek, Alexis Tsipras

Egyptian billionaire Naguib Sawiris said he will send formal letters tomorrow to Greek Prime Minister Alexis Tsipras and Italian Prime Minister Matteo Renzi requesting to buy an island to house the outpour of Syrian refugees and migrants.

వాళ్ల కోసమే ఓ దీవిని కొన్నాడు

Posted: 09/08/2015 01:21 PM IST
Egyptian billionaire urging greek and italian leaders to sell him island for refugees

ఒకే ఒక్క ఫోటో ప్రపంచంలో చలనం తీసుకువచ్చింది. ఒకే ఒక్క ఫోటో వేల మందికి మేలు చేస్తోంది. ఒకే ఒక్క ఫోటో మనిషిలో ఉన్న మానవత్వాన్ని మేలుకొలిపింది. మనిషిలో మానవత్వం, మంచి తనం ఇంకా మరుగవ్వలేదని కొన్ని సంఘటనలు చూసి స్పందించిన మనుష్యులను చూస్తే అనిపిస్తుంది. టర్కీ సముద్రంలో మూడు సంవత్సరాల పసి పిల్లాడు నిర్జీవంగా పడిఉన్న హృదయ విదారక చిత్రం యావత్ ప్రపంచాన్నంతటనీ కదిలించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన సిరియా శరణార్ధుల దయనీయ పరిస్థితికి నిదర్శనం. వారి దీన స్థితికి ఈజిప్టుకు చెందిన ఓ బిలియనీర్ సిరియా శరణార్ధుల కోసం ఆశ్రయం కలిపించడం కోసం ఓ ఐలాండ్ ను కొనేందుకు ముందుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే...

సిరియా శరణార్ధుల కోసం ఈజిప్టుకు చెందిన సావరీస్ ఒరాస్ కామ్ టెలికాం నెట్ వర్క్ అధినేత అత్యంత సంపన్నడు సావరీస్ అంతర్యుద్దం వల్ల వలస వెళ్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి నివాసం కోసం ఓ ఐలాండ్ ను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాడు. గ్రీస్, ఇటలీ లో ఖాళీగా ఉన్న దీవుల్లో ఒకదాన్ని అమ్మితే కొనుగోలు చేస్తానని ట్విట్టర్ లో ట్విట్ చేశారు. ఆ ఐలాండ్ లో వలసదారులకు అవసరమైన ఇళ్ళు, ఆస్పత్రులు, పాఠశాలలు వంటి సౌకర్యాలు కల్పిండమే కాదు... వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. దీవిని కొనుగోలు చేయడానికి 10 నుంచి 100 మిలియన్ డాలర్లను ఖర్చుచేసేందుకు సిద్ధమని తెలిపాడు. సిరియాలో పరిస్థితులు మెరుగు పడ్డాక వారు కావాలనుకుంటే తిరిగి వెళ్ళిపోవచ్చునని చెప్పారు. గ్రీస్, ఇటలీ ప్రభుత్వాలు ఐలాండ్ అమ్మడానికి సిద్దమైతే... వెంటనే కొనుగోలు చేసి ఆ ఐలాండ్ కు 'హ్యూమన్ బీయింగ్స్' అనే పేరు పెట్టి వలస వచ్చేవారికి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేస్తానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Syrians  Migrants  Refugees  Egyptian Billionaire  Naguib Sawiris  Greek  Alexis Tsipras  

Other Articles