Software Engineer Gokul Create Sensation By Sending Fake Bomb Messages To Airport To Get Her Love | Gokul Killed Wife

Software engineer gokul crime news fake bomb messages airports killed wife

gokul crime news, gokul fake bomb messages, software engineer crime news, software engineer gokul crime news, gokul fake id, bomb blasts airports, bomb blast calls airports, gokul killed wife, gokul illicit affair

Software Engineer Gokul Crime News Fake Bomb Messages Airports Killed Wife : Software Engineer Gokul Create Sensation By Sending Fake Bomb Messages To Airport To Get Her Love. He Also Killed His Wife.

భార్యను కడతేర్చాడు.. ప్రియురాలి భర్తను ఇరికించే కుట్ర!

Posted: 09/08/2015 11:40 AM IST
Software engineer gokul crime news fake bomb messages airports killed wife

అతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా, కూల్ గా వుంటాడు. అందరితోనూ సఖ్యతగా వ్యవహరించే వ్యక్తిత్వం కలవాడు. కానీ.. ఆ వినయం వెనుక ఓ రాక్షసుడు కూడా దాగి వున్నాడని విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అతగానిలో ఎంత క్రూరత్వం దాగివుందంటే.. తన ప్రియురాల్ని దక్కించుకోవడానికి ప్రేమించిన తన భార్యనే కడతేర్చాడు. అంతేకాదు.. తన ప్రియురాలి భర్తను ‘ఐఎస్ఐఎస్’ ఉగ్రవాదిగా ముద్ర వేయడానికి పెద్ద కుట్రే పన్నాడు. విమానాల్లో బాంబులున్నాయని ఫేస్ మెసేజ్ లు పెట్టాడు. కానీ.. చివరికి పోలీసులకు చిక్కి జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఎంజీ గోకుల్ (37) అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో ఇతనికి ఫేస్‌ బుక్ ద్వారా అనూరాధ అనే అమ్మాయి పరిచయం అయింది. అది ప్రేమగా మారి, చివరికి పెళ్లిదాకా వెళ్లింది. వీరికి ఓ కుమార్తె కూడా వుంది. వీరిద్దరి జీవితం సుఖసంతోషాలతో గడిచింది. కానీ.. గోకుల్‌ ను బెంగళూరుకు బదిలీ చేయడంతో సమస్యలు వచ్చిపడ్డాయి. అనురాధ తనతోపాటు బెంగుళూరు రాలేనని తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బెంగళూరులోనే ఉంటున్న గోకుల్ కు తన చిన్ననాటి స్నేహితురాలు శిజు జోష్ కనిపించింది. ఆమెకు దగ్గరయ్యాడు. అంతేకాదు.. ఆమెను ప్రేమించడంతోపాటు తనతోపాటు వచ్చేయాల్సిందిగా ఆమెను ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. అయితే.. తన భర్తను వదిలి వచ్చేందుకు శిజు ఇష్టపడలేదు. తాను తన భర్తతో సంతోషంగానే వున్నానని శిజు చెప్పడంతో తీవ్ర ఆగ్రహావేశానికి గురైన గోకుల్.. ఆమెను దక్కించుకోవడానికి కుట్ర చేశాడు. ఆమె భర్తను బాంబు కేసులో ఇరికించాలని ప్లాన్ వేశాడు.

తొలుత అతని పాస్ పోర్టు జిరాక్స్ సంపాదించి.. ఓ నకిలీ సిమ్ తీసుకున్నాడు. ఆ సిమ్ ద్వారా బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయానికి ఫోన్ చేసి, ఎయిర్ పోర్టులో బాంబులున్నాయంటూ అబద్ధం చెప్పాడు. అనంతరం బెంగుళూరు విమానాశ్రయానికి ‘వాట్సప్’ ద్వారా బాంబులున్నాయని తప్పుడు బెదిరింపు సందేశాలు పంపాడు. ఈ సమాచారం అందుకున్న బెంగళూరు నేర నియంత్రణ విభాగం (సీసీబీ) తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. ఆ సందేశాలు అసత్యమని నిర్ధారించింది. విచారణ మొదలు పెట్టి, ఇదంతా గోకుల్ పనేనని తేల్చింది. ఈ విచారణలో భాగంగానే గోకుల్ చేసిన మరో భయంకర దారుణం వెలుగుచూసింది. ఆగస్టు 28న తన భార్య అనురాధ చేత మద్యం తాగించి, బలమైన వస్తువుతో కొట్టి చంపేశాడు. ఆపై తలకు దెబ్బ తగిలి చనిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇప్పుడా కేసును తిరగదోడే పనిలో పోలీసులు ఉన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles