KCR | China | Guvvala balraj

Telangana cm kcr bumper offer to that mla who beaten congress mla

KCR, China, Guvvala balraj, Balraj, China Tour, Mahabubnagar

Telangana cm KCR bumper offer to that MLA who beaten congress MLA. KCR went china in this morning with his team. Guvvala balraj, who beaten congress mla in Mahabubnagar.

ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించినందుకు బంపరాఫర్

Posted: 09/07/2015 12:42 PM IST
Telangana cm kcr bumper offer to that mla who beaten congress mla

అదృష్టవంతులకు మాత్రమే బంపర్ ఆఫర్ లు వస్తుంటాయి.. కానీ ఓ ఎమ్మెల్యేకు మాత్రం అనుకోని విధంగా ఆఫర్ వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలో జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యేల మధ్య గొడవ తీవ్రమై.. మరో ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించేంత వరకు వెళ్లింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్ రెడ్డి మీద చెయ్యిచేసుకున్నారు. దీని మీద కాంగ్రెస్ నాయకులు బంద్ కూడా నిర్వహించారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే మీద గవర్నర్ కు ఫిర్యాదు చేయడం కూడా జరిగిపోయింది. అయితే అలా వివాదాల్లో ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆపర్ ఇచ్చారు. ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించినందుకే ఈ ఆపర్ ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం చైనా పర్యటకు బయలుదేరారు. కేసీఆర్ తో పాటుగా కొంత మంది ఉన్నతాధికారులు, కొంత మంది రాజకీయ నాయకులు కూడా వెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కాబట్టి ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఉండాల్సిందే. చైనా పర్యటన అసలు ఉద్దేశం తెలంగాణకు పెట్టుబడుల వరద పారించడమే కాబట్టి ఉన్నతాధికారులు ఉండాలి. కానీ కేసీఆర్ వెంట నడుస్తున్న బృందంలో ఓ ఎమ్మెల్యే వార్తల్లో నిలుస్తున్నారు. మహబూబ్ నగర్ లో సాటి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన గువ్వల బాలరాజ్ ను కూడా కేసీఆర్ తన వెంట చైనాకు తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చేస్తున్నదేమో చైనా పర్యటన.. ఉద్దేశమేమో పారిశ్రామికు పెట్టుబడులను ఆకర్షించడమే.. మరి ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ను వెంట తీసుకెళ్లడంలో అసలు ఉద్దేశం ఏంటి..? దీని మీద కేసీఆరే క్లారిటీ ఇవ్వాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  China  Guvvala balraj  Balraj  China Tour  Mahabubnagar  

Other Articles