rs 50 lakh from the case in order to avoid deal

Key politician brings pressure on police to avoid case

sexual assult on minor girl, minor girl sexual assult, vijayawada police, minor girl sexual assult by criket bookies, guntur district key politicion son, case diversion deal, sexual case diversion deal, Ruppees 50 lakh deal, sexual assult, minor girl, criket bookies

Guntur district key politician son enters into deal with relatives of cricket bookies for Rs 50 lakh, who brings pressure on police to aviod case

లైంగికదాడి కేసును నీరుగార్చుందుకు కుట్ర.. రూ. 50 లక్షల డీల్..!

Posted: 09/06/2015 01:59 PM IST
Key politician brings pressure on police to avoid case

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసు నీరుగారుతుందా..? అంటే అవుననే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. అమాయిక బాలికపై అత్యాచారం జరిగితే న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులే.. కేనును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇలాంటి నేతల ద్వారా కేసు నుంచి బయటకు వచ్చే నిందితులు.. డబ్బుంటే చాలు.. ఏం చేసినా చెల్లుతుందని భావించి.. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడతారనేది మాత్రం చెప్పక తప్పదు. ఇక అత్యాచారానికి గురైన అమ్మాయి తమ బంధువులో, లేక సన్నిహితుల కూతురో, సోదరో, పరిచయస్థుల అమ్మాయి అయితే విభిన్నంగా వ్యవహరించే నేతలు.. తమవారు కాదని తెలియగానే డీల్ కుదుర్చుకుని కేసును నీరుగారుస్తారా..? అంటే ప్రసుత్త పరిణామాలను చూస్తే ఎలా కాదని చెప్పగలం.

అత్యాచారా కేసులో, విజయవాడ పోలీసుల  అదుపులో వున్న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన నలుగురు క్రికెట్ బుకీలను  బయటకు తీసుకువచ్చేందుకు అక్షరాల యాబై లక్షల రూపాయల డీల్ కుదిరిందన్న వార్తులు వినబడుతున్నాయి. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా వుంటూ  అజ్ఞాతంలోకి వెళ్లిన మరో ఐదుగురు బుకీలను కూడా బయటకు తీసుకువచ్చేందుకు డీల్ కుదిరిందని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత తనయుడు.. నిందితులతో డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.

క్రికెట్ బుకీల వద్దకు మైనర్ బాలికను పంపిన బ్రోకర్‌ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని సెల్ నుంచి వాట్సప్ ద్వారా 32 మందికి బాలిక ఫొటోలు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వారిందరినీ విచారించేందుకు దర్యాప్తును వేగంవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రెండు రోజుల వ్యవధిలో సుమారు 20 మంది వరకూ బాలికను శారీరకంగా అనుభవించినట్టు విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. వీరిలో ఎక్కువమంది గుంటూరు జిల్లాకు చెందిన క్రికెట్ బుకీలే కావడం గమనార్హం.

ఈ క్రమంలో నిందితుల బంధువులు తమ వారిని కేసు నుంచి తప్పించాలంటూ ముఖ్య నేత తనయుడిని ఆశ్రయించగా 50 లక్షల రూయాలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు తీసుకున్న ఆయన.. కేసును నీరుగార్చేందుకు అప్పుడే ప్రయత్నాలే మొదలుపెట్టారని తెలుస్తుంది. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులపై ఒత్తిడిని తీసుకువస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో శనివారమే తన అనుయాయులను విజయవాడకు పంపినట్లు సమాచారం. పోలీసులపై ఒత్తిడి తేవడంతోపాటు డబ్బులు ముట్టజెప్పి కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారు. అలా కుదరని పక్షంలో బాధిత మైనర్ బాలిక కుటుంబసభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి.. వారికి పరిహారంగా కొంత డబ్బు ఇచ్చి కేసుతో నరసరావుపేటకు చెందిన బుకీలకు సంబంధం లేదని చెప్పించాలని చూస్తున్నట్లు తెలిసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles