America Survey Releals The Sectet For Boys To Impress Girl | How To Impress Girl | Love Affairs

America survey on love how to impress girl

how to impress girl, love matters, love couples, love birds, america survey on love, how to impress girl tips, tips for boys to impress girl

America Survey On Love How To Impress Girl : America Survey Releals The Sectet For Boys To Impress Girl.

అమ్మాయి మనసు గెలవాలంటే.. ఇలా చేయండి!

Posted: 09/04/2015 08:52 PM IST
America survey on love how to impress girl

అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి యువకులు నానారకాలుగా తంటాలు పడుతుంటారు. ఖరీదైన దుస్తులు ధరించడం, సినిమాల్లో హీరోల్లాగా తమను మార్చుకోవడం, ఆకతాయిగా వ్యవహరించడం.. ఇంకా తమకు తెలిసిన పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం వుంటుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం. నిజానికి.. చాలా మంది యువకులకు ఏం చేస్తే అమ్మాయిల మనసుల్లో స్థానం సంపాదించవచ్చో అనే విషయం ఓ పట్టాన అర్థం కాదు. దీంతో చాలామంది తమకు గర్ల్ ఫ్రెండ్స్ లేరని, అలాంటి వాటికి తాము దూరంగా వుంటామని చెబుతుంటారు. అయితే.. అటువంటి అబ్బాయిలకు ఇకనుంచి అలా చెప్పాల్సిన అవసరం లేదని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే.. అమ్మాయి మనసుల్లో ఎలా స్థానం సంపాదించుకోవాలో వారు సూచిస్తున్నారు.

‘అమ్మాయి మనసులో యువకుడు స్థానం ఎలా గెలుచుకోవాలో’ అన్న విషయంపై అమెరికాలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేమిటంటే.. అమ్మాయిలను నవ్విస్తూ ఉండడం ఎలాగో నేర్చుకుంటే వారి మనసుల్లో చోటు సంపాదించవచ్చని పరిశోధకులు అంటున్నారు. ఎవరైనా అమ్మాయికి ఒకేసారి పరిచయమైన ఇద్దరబ్బాయిల్లో.. హాస్య చతురత ఎక్కువగా ఉండే వ్యక్తిని వారు ఇష్టపడుతున్నట్టు తేలింది. అంటే.. తాను కామెడీగా వుంటూనే అమ్మాయిల్ని నవ్వించడం అన్నమాట. అటువంటి యువకుడితో డేటింగ్ కు వెళ్లేందుకు కూడా సదరు అమ్మాయిలు వెనుకాడడం లేదని సర్వే వెల్లడించింది. అబ్బాయిల్లో సెన్సాఫ్ హ్యూమర్ ను అమ్మాయిలు ఇష్టపడతారని, అలా నవ్వుతూ, నవ్వించే వారితో జీవితం ఆనందంగా ఉంటుందని వారు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : how to impress girl  love affairs  

Other Articles