guntur district court denies bail to accused in rishiteswari case

District court of guntur rejects bail plea of rishiteswari case accused

rishiteswari case, Nagarjuna University, Ragging, ANU, Acharya Nagarjuna University, Mondi Rishiteswari Ist yr B.Arch student, ganta srinivas rao, guntur district sessions court, accused bail petition, Rishiteswari accused bail rejected, court rejects accused bail petition

guntur district sessions court denies bail to accused in rishiteswari case after hearing both sides arguments

రిషితేశ్వరి కేసు నిందితులకు బెయిల్ తిరస్కరణ

Posted: 09/03/2015 09:48 PM IST
District court of guntur rejects bail plea of rishiteswari case accused

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎం.రుషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హనీషా, జయచరణ్, శ్రీనివాస్ లు తమకు బెయిట్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్నారు. నిందితుల బెయిల్ పిటిషన్ పై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

ఈ సందర్భంగా రిషితేశ్వరి కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. గత రెండు నెలల క్రితం ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విచారించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగ్ కే ప్రధాన కారణమని తన నివేదికలో స్పష్టం చేసింది. రిషితేశ్వరి రాసిన డైరీ ఆధారంగా పోలీసులు పలువురిని ప్రధాన నిందితులుగా అరెస్టు చేశారు. అయితే వీరందరూ గత 49 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishiteswari case  Nagarjuna University  Ragging  ANU  

Other Articles