ఇషాంత్ శర్మ మీద ఐసీసీ ఆగ్రహంగా ఉన్నా కానీ టీమిండియా కెప్టన్ మాత్రం కూల్ గా అతన్ని వెనకేసుకొస్తున్నారు. ఇషాంత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గొడవ పడటం తమకు మంచి చేసిందని, ఆ గొడవ వల్ల ఇషాంత్ శర్మ బౌలింగులో ఎంతో మార్పు కనిపించిందని టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరించారు ఎప్పుడు గెలుపో తమ లక్ష్యమని చెప్పాడు. డ్రా ఆఖరి ప్రత్యామ్నాయం అని చెప్పాడు. శ్రీలంక పైన సిరీస్ విజయం జట్టుకు కావాల్సిన శక్తిని ఇచ్చిందని చెప్పాడు. సిరీస్‌ను మేం గెలిచిన తీరు, భవిష్యత్తులో మాకు ఉత్త్పేరకంగా పని చేస్తుందన్నాడు. ఈ సిరీస్‌లో బౌలర్ల పాత్ర బాగుందన్నాడు. ఆఖరి టెస్టులో పుజారా క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడని, ఈ సిరీస్ బౌలర్లదేనని చెప్పాడు. టెస్టు క్రికెట్లో నేను చూసిన మంచి ఇన్నింగ్సులలో ఇది ఒకటి అన్నాడు. ఈ విజయంతో కెప్టెన్‌గా నేను ఎదిగానని అనుకోనని, మళ్లీ ఓ తప్పు చేస్తే అందరూ నన్ను పిల్లాడిలా చూస్తారన్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టు నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇశాంత్ శర్మకు, లంక ఫాస్ట్ బౌలర్ ధమ్మిక ప్రసాద్‌కు మధ్య మాటల యుద్దం నడిచింది. . ఈ గొడవలో ఉద్దేశపూర్వకంగా ఇశాంత్ శర్మను ఢీకొట్టినందుకుగాను శ్రీలంక బ్యాట్స్‌మన్ దినేశ్ చండిమాల్‌కు ఒక వన్‌డే మ్యాచ్‌నుంచి సస్పెండ్ చేయగా లాహిరు తిరుమానె, ధమ్మిక ప్రసాద్‌లకు వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. అయితే
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more